Health Tips : ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే ఎలాంటి సమస్యలు మీ దరిచేరవు….డాక్టర్ సలహా…

Health Tips : వైద్యశాస్త్రంలో కలబంద అనేది అద్భుతమైన మూలిక. ఇక ఈ మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో దర్శనమిస్తుంది. దీనిలో ఆరోగ్యానికి ఉపయోగపడే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కలబందలో విటమిన్ ఏ , సి , ఇ ,బి1, బి2, బి3,బి6,బి12, మరియు పోలిక్ యాసిడ్ అలాగే 18 రకాల అమైనో ఆసిడ్స్ ఉన్నాయి. అంతేకాక కలబంద కాల్షియం, క్రోమియం ,సెలీనియం ,మెగ్నీషియం, జింక్ ,సోడియం ,ఇనుము, పొటాషియం మరియు కాపర్, మాంగనీస్ వంటి […]

  • Published On:
Health Tips : ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే ఎలాంటి సమస్యలు మీ దరిచేరవు….డాక్టర్ సలహా…

Health Tips : వైద్యశాస్త్రంలో కలబంద అనేది అద్భుతమైన మూలిక. ఇక ఈ మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో దర్శనమిస్తుంది. దీనిలో ఆరోగ్యానికి ఉపయోగపడే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కలబందలో విటమిన్ ఏ , సి , ఇ ,బి1, బి2, బి3,బి6,బి12, మరియు పోలిక్ యాసిడ్ అలాగే 18 రకాల అమైనో ఆసిడ్స్ ఉన్నాయి. అంతేకాక కలబంద కాల్షియం, క్రోమియం ,సెలీనియం ,మెగ్నీషియం, జింక్ ,సోడియం ,ఇనుము, పొటాషియం మరియు కాపర్, మాంగనీస్ వంటి 20 రకాల మినరల్స్ కూడా ఉన్నాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ ,యాంటీ ఫంగల్, యాంటీబయోటిక్ వంటి వైరల్ లక్షణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఇన్ని రకాల ఔషధ గుణాలను కలిగిన కలబందను ఉదయం పూట ఖాళీ కడుపుతో జ్యూస్ చేసుకొని తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

if-you-drink-this-juice-every-day-on-an-empty-stomach-you-will-not-face-any-problems-doctors-advice

 

బరువు తగ్గడానికి…

if-you-drink-this-juice-every-day-on-an-empty-stomach-you-will-not-face-any-problems-doctors-advice

ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగడం వలన చాలా సులువుగా బరువు తగ్గుతారు అని నిపుణులు తెలియజేస్తున్నారు. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో గల టాక్సిన్స్ ను బయటకు పంపి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ తొలగించడం వలన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసి మనం తీసుకున్న ఆహారాల నుండి పోషకాలను గ్రహిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

షుగర్ కంట్రోల్…

if-you-drink-this-juice-every-day-on-an-empty-stomach-you-will-not-face-any-problems-doctors-advice

షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు కాళీ కడుపుతో ఉదయం కలబంద జ్యూస్ తాగడం వలన అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చని నిపుణుల అంచనా. అయితే కలబంద లెక్టిన్ ,ఆంత్రక్వినోన్స్ ఉన్నాయి. ఇక ఇవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడమే కాక మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. కానీ ఈ కలబంద జ్యూస్ అనేది అందరికీ పడదు. కావున షుగర్ పేషెంట్స్ కలబంద జ్యూస్ తాగే ముందు ముందుగా మీ డాక్టర్ ను సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.

మలబద్ధకం….

if-you-drink-this-juice-every-day-on-an-empty-stomach-you-will-not-face-any-problems-doctors-advice

మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి కూడా కలబంద దివ్య ఔషధం లా పనిచేస్తుంది. ఇది పేగు వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగడం వలన ఇది మలాన్ని మృదువుగా చేసి మలబద్దకానికి చెక్ పెడుతుంది.

కలబంద జ్యూస్ తయారీ…

కలబంద జ్యూస్ చేసుకోవాలనుకునేవారు ముందుగా ఒక గ్లాసు నీళ్లలో ఐదు టేబుల్ స్పూన్ ల కలబంద గుజ్జును, మరియు కొంచెం నిమ్మరసం, తేనె వేసి కలుపుకోవాలి. ఇక అంతే జ్యూస్ రెడీ అయిపోయినట్టే..

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.