Health Tips : ప్రతిరోజు ఉదయం ఇలా చేయడం ద్వారా అనారోగ్యానికి తక్కువ గురవుతారు…

Health Tips : డిసెంబర్ జనవరి నెలలో చల్లటి వాతావరణం అనంతరం ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు మంచు మబ్బుల వెనక దాగి ఉన్న సూర్యుడు ఇప్పుడు దర్శనమిస్తున్నాడు. అయితే చలికాలంలో సూర్యరశ్మిని చూస్తే చాలామందికి ఆనందం కనిపిస్తుంది. అయితే శీతాకాలంలో సూర్యరశ్మి ఎక్కువగా లేకపోవడం వలన శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. దీని కారణంగా కీళ్లనొప్పులు, శరీర నొప్పులు నిరాశ ,చిరాకు , రోగ నిరోధక శక్తి కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం 11 […]

  • Published On:
Health Tips : ప్రతిరోజు ఉదయం ఇలా చేయడం ద్వారా అనారోగ్యానికి తక్కువ గురవుతారు…

Health Tips : డిసెంబర్ జనవరి నెలలో చల్లటి వాతావరణం అనంతరం ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు మంచు మబ్బుల వెనక దాగి ఉన్న సూర్యుడు ఇప్పుడు దర్శనమిస్తున్నాడు. అయితే చలికాలంలో సూర్యరశ్మిని చూస్తే చాలామందికి ఆనందం కనిపిస్తుంది. అయితే శీతాకాలంలో సూర్యరశ్మి ఎక్కువగా లేకపోవడం వలన శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. దీని కారణంగా కీళ్లనొప్పులు, శరీర నొప్పులు నిరాశ ,చిరాకు , రోగ నిరోధక శక్తి కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల లోపు ఒక అరగంట పాటు ఎండలో కూర్చోవడం చాలా మంచిది. ఇక ఇది విటమిన్ డి అందించి శరీరాన్ని నొప్పుల నుండి రక్షిస్తుంది. తద్వారా విటమిన్ డీ లోపం ఏర్పడకుండా ఉంటుంది.

అయితే విటమిన్ డి ఉత్తమ మూలం సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయం దాదాపు ఒక అరగంట పాటు ఎండలో కూర్చోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎండలో కూర్చోవడం వలన శరీరానికి విటమిన్ డి అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉంటారు.అయితే విటమిన్ డి సూర్యకాంతి ఉదయం 11 నుండి 11:30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ తర్వాత సూర్యకాంతి బలంగా మారడంతో హానికరమైన UV కిరణాలు మరింత హాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే కేవలం 11 గంటల లోపు ఉన్న సూర్యరశ్మి మాత్రమే శరీరానికి మంచిదని భావిస్తున్నారు. అయితే ఈ పదకొండు గంటల లోపు సూర్య రశ్మిని పొందడానికి తక్కువ దుస్తులు ధరించి ఎండలో కూర్చోవడం మంచిది. ఇక మీ చేతులు పాదాలు శరీరం చర్మం వీలైనంతవరకు ఎండలో ఉండేలా చూసుకోవాలి.

కానీ ఇప్పుడు ఎండలో బట్టలు లేకుండా కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక అలాంటి సందర్భాలలో మీరు కేవలం హోల్స్ మాదిరిగా ఉన్న దుస్తులను ధరించి ఉండవచ్చు.అదేవిధంగా చేతులు కాళ్లు ఎప్పుడు బయట ఉండే దుస్తులను వేసుకొని సూర్యరశ్మిలో కూర్చోవడం మంచిది. అయితే మానవ శరీరానికి విటమిన్ డి చాలా ముఖ్యం.ఇక ఈ విటమిన్ డి ఎముకలను బలపరిచి శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. ఇక ఈ విటమిన్ డి లోపం ఏర్పడిన పిల్లలు మరియు వృద్ధులలో బలహీనత లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఎదుగుతున్న పిల్లలను ప్రతిరోజు సూర్య రష్మికి గురయ్యేలా చేయాలి. అప్పుడే పిల్లలలో ఎముకలు సరైన అభివృద్ధి పటిష్టతను సాధిస్తాయి. అలాగే పిల్లలలో రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది. కాబట్టి ప్రతిరోజు సూర్యలక్ష్మి ని సాధించడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ కథనం ద్వారా చెప్పడం జరిగింది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపోందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని దృవీకరించలేదు.