Health Tips : కాల్చిన వెల్లుల్లి తింటే ఎన్ని ప్రయోజనాలో …ముఖ్యంగా పురుషులకి…

Health Tips : వెల్లుల్లి జీర్ణ క్రియను మెరుగుపరచడం తో పాటు నోటి ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాక ఇది గుండె ఆరోగ్యానికి మరియు మూత్రపిండాల పని తీరుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అయితే పచ్చి వెల్లుల్లి తీసుకోవడం కంటే కాల్చిన వెల్లుల్లి తీసుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాల్చిన వెల్లుల్లి తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందట . అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ఎంతగానో […]

  • Published On:
Health Tips : కాల్చిన వెల్లుల్లి తింటే ఎన్ని ప్రయోజనాలో …ముఖ్యంగా పురుషులకి…

Health Tips : వెల్లుల్లి జీర్ణ క్రియను మెరుగుపరచడం తో పాటు నోటి ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాక ఇది గుండె ఆరోగ్యానికి మరియు మూత్రపిండాల పని తీరుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అయితే పచ్చి వెల్లుల్లి తీసుకోవడం కంటే కాల్చిన వెల్లుల్లి తీసుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాల్చిన వెల్లుల్లి తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందట . అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా కాల్చిన వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కాల్చిన వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుందని అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి.

how-many-benefits-of-eating-roasted-garlic-especially-for-men

అంతేకాక కాల్చిన వెల్లుల్లి ఆరోగ్యకరమైన జీర్ణ క్రియ కు మరియు ప్రేగు పనితీరుకు ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక కాల్చిన వెల్లుల్లిలో విటమిన్ సి ,మాంగనీస్ ,విటమిన్ b6 వంటి శరీరానికి అవసరమయ్యే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే కాల్చిన వెల్లుల్లి ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాలి. కాల్చిన వెల్లుల్లిలో అల్సిన్ అనే సమ్మేళనం ఉండడం వలన కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు దీనికి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో కూడా కాల్చిన వెల్లుల్లి ఎంతగానో దోహదపడుతుంది. అలాగే కాల్చిన వెల్లుల్లి రక్త ప్రసరనకు మరియు రక్తం గడ్డకట్టకుండా నివారించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.