Health Tips : సరిగ్గా నిద్రపోవట్లేదా మీ అందం ఇలా కరిగిపోతుంది…

Health Tips : ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్ వల్ల చాలామందికి కంటి నిండా నిద్ర లేకపోవడం జరుగుతుంది. ఇక ఉన్న కాస్త టైం కూడా సెల్ ఫోన్ పట్టుకుని నిద్రపోకుండా జాగారం చేస్తున్నారు. దీనివల్ల నిద్ర పోలేకపోతున్నారు . ఇలా చేయడం వలన చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దీనివల్ల ఆరోగ్యంపాడు కావడమే కాకుండా మరొక నష్టం కూడా ఉంటుంది. అదేమిటంటే అందం దెబ్బతింటుంది. ఇక ఈ నేపథ్యంలోనే అందరి […]

  • Published On:
Health Tips : సరిగ్గా నిద్రపోవట్లేదా మీ అందం ఇలా కరిగిపోతుంది…

Health Tips : ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్ వల్ల చాలామందికి కంటి నిండా నిద్ర లేకపోవడం జరుగుతుంది. ఇక ఉన్న కాస్త టైం కూడా సెల్ ఫోన్ పట్టుకుని నిద్రపోకుండా జాగారం చేస్తున్నారు. దీనివల్ల నిద్ర పోలేకపోతున్నారు . ఇలా చేయడం వలన చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దీనివల్ల ఆరోగ్యంపాడు కావడమే కాకుండా మరొక నష్టం కూడా ఉంటుంది. అదేమిటంటే అందం దెబ్బతింటుంది. ఇక ఈ నేపథ్యంలోనే అందరి మెదడులో ప్రశ్నలే వస్తున్నాయి. అసలు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలి.. నిద్ర లేకపోతే సౌందర్యం కరిగిపోతుందా.. అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

అయితే మనం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించాలి అంటే కనీసం రోజుకి 7 నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరం అని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే చాలామంది ఈ రోజుల్లో పని ఒత్తిడి కారణంగా మరియు ఫోన్ ల కారణంగా ఎంతో విలువైన నిద్రను దూరం చేసుకుంటున్నారు. అయితే దీనివల్ల శరీరంలో అనేక రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇక దీని వలన మొఖంపై ప్రభావం చూపుతుంది అని చెబుతున్నారు.5 చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు.

చర్మం నీరసంగా కనిపిస్తుంది..

సరిగా నిద్ర లేకపోవడంతో చర్మం పొడి బారే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే దీనివల్ల శరీరంలో పీహెచ్ స్థాయి దెబ్బతింటుంది అని చెబుతున్నారు. ఇక ఈ సమస్య వల్ల తక్కువ వయసు ఉన్నవారు కూడా ఎక్కువ వయసు ఉన్న వారిలా కనిపిస్తారంట. మరియు మొఖం మీద మొటిమలు వస్తాయి. మరియు చర్మం పై ముడతలు పడతాయి అని నిపుణులు పేర్కొంటున్నారు.

జుట్టు రాలిపోవడం..

సరిపడా నిద్ర లేకపోవడం వలన చుట్టు రాలిపోవడం అనేది ఒక పెద్ద సమస్య. ఇక దీనివల్ల జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది. ఇక దీనివల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కళ్ళ కింద వాపు..

నిద్ర లేకపోవడం వలన కళ్ల కింద వాపు రావడం జరుగుతుంది. దీనివల్ల అందం దెబ్బతింటుందట. అలాగే కళ్ళు ఎర్రబడడం. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు కచ్చితంగా కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి అని నిపుణులు చూపిస్తున్నారు.

డార్క్ సర్కిల్స్…

ఈ కాలంలో ఎక్కువమంది ఉండే సమస్య కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉండడం. అయితే మనం నిద్రపోతున్నప్పుడు శరీరంలో దెబ్బతిన్న కణాలు ఉత్పత్తి అవుతాయి. ఇక అలాంటి వారికి నిద్ర సరిపోకపోతే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేలా ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చర్మం పై ముడతలు…

మనం నిద్రపోతున్నప్పుడు శరీరంలో కొల్ల హార్మోన్ విడుదలవుతుంది. ఇక ఇది చర్మం మెరుగుపడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు నిపుణులు. అయితే నిద్రకు దూరమైతే కొల్ల జాన్ హార్మోన్ ఉత్పత్తి నిలిచిపోతుంది అని దీని ఫలితంగా రక్తంలో కలెస్ట్రాల్ పెరుగుతాయని చెబుతున్నారు. దీని కారణంగా చర్మంపై ముడతలు పడతాయని చెబుతున్నారు.