Health Tips : అరటిపండుతో కలిపి ఈ ఆహార పదార్థాలను తీసుకుంటున్నారా…తస్మాత్ జాగ్రత్త…

Health Tips : సూపర్ ఫ్రూట్ గా పేరు పొందిన పండ్లలో అరటిపండు కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పోషకాలను కలిగి ఉన్న పండ్లలో అరటిపండు కూడా మంచి ఆదరణ పొందింది. ఇక ఈ అరటి పండు ఫ్రూట్ గా మరియు కూరగాయ గా అదేవిధంగా దాని ఆకులను భోజనం వడ్డించే ఆకుగాను వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఈ అరటి పండులో ఫైబర్, ప్రోటీన్ , ఆరోగ్యకర కొవ్వులు , మరియు అత్యవసర మినరల్స్, […]

  • Published On:
Health Tips : అరటిపండుతో కలిపి ఈ ఆహార పదార్థాలను తీసుకుంటున్నారా…తస్మాత్ జాగ్రత్త…

Health Tips : సూపర్ ఫ్రూట్ గా పేరు పొందిన పండ్లలో అరటిపండు కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పోషకాలను కలిగి ఉన్న పండ్లలో అరటిపండు కూడా మంచి ఆదరణ పొందింది. ఇక ఈ అరటి పండు ఫ్రూట్ గా మరియు కూరగాయ గా అదేవిధంగా దాని ఆకులను భోజనం వడ్డించే ఆకుగాను వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఈ అరటి పండులో ఫైబర్, ప్రోటీన్ , ఆరోగ్యకర కొవ్వులు , మరియు అత్యవసర మినరల్స్, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. అయితే జలుబు , దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు అలాగే మధుమేహం సమస్య ఉన్నవారు అరటి పండ్లను అసలు తీసుకోకూడదని చెబుతున్నారు. అయితే అరటి పండ్లను సరైన మోతాదులో మితంగా తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

are-you-taking-these-food-items-along-with-banana

కానీ అరటిపండును కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి అలవాట్లు ఉన్నవారు తక్షణమే మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.మరి ఏ ఆహార పదార్థాలతో అరటిపండును తీసుకోకూడదో ఎప్పుడు తెలుసుకుందాం. అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అరటిపండు సహజంగానే ఆమ్లత్వం కలిగి ఉంటుంది. ఇక పాలు తీయదనాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన జీర్ణక్రియలలో ఇబ్బందులు తలెత్తుతాయట. ఇక ఈ విషయాన్ని ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ సూర్య భాగవతి తెలియజేశారు.

అందుకే పాలు మరియు అరటిపండు సరైన కాంబినేషన్ కాదని పరస్పర విరుద్ధమైన ఆహారాలను కలిపి తీసుకోవడం మంచిది కాదని ఆమె తెలిపారు. అలాగే అరటిపండును రెడ్ మీట్ తో కూడా తీసుకోకూడదట. అరటి పండులో జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు ఉపయోగపడుంటుంది. ఇక రెడ్ మీట్ లో ఉండే అధిక ప్రోటీన్ , జీర్ణ క్రియను నిమ్మదింపచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రెండు పరస్పర విభేదాలు కలిగిన అరటిపండు మరియు రెడ్ మీట్ ఒకేసారి తీసుకోవడం వలన గ్యాస్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందట. అదేవిధంగా అరటిపండును బేక్ గూడ్స్ జామ , నిమ్మ , దానిమ్మ , స్టాబెర్రీ వంటి సిట్రస్ పండ్లతో కలిపి అసలు తీసుకోకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.