Health Tips : తరచూ ముక్కులో వేలు పెట్టుకుంటున్నారా…ఈ జాగ్రత్తలు తప్పనిసరి…
Health Tips : చాలామందికి ముక్కులో వేలు పెట్టుకోవడం అనేది అలవాటుగా ఉంటుంది. కానీ ఈ అలవాటు మిమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులకు వ్యాధులకు గురి చేస్తుందని మీకు తెలుసా…?అయితే ముక్కులో వేలు పెట్టుకునే ఈ అలవాటు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చాలామందికి ఉంటుంది. ఇక కొందరు బహిరంగంగాను మరికొందరు రహస్యంగాను ఈ అలవాటును చేస్తూ ఉంటారు. చాలా సందర్భాలలో ఎవరైనా ఇలా చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇక ఆ వ్యక్తి అలా చేస్తున్నప్పుడు ఎవరైనా […]
Health Tips : చాలామందికి ముక్కులో వేలు పెట్టుకోవడం అనేది అలవాటుగా ఉంటుంది. కానీ ఈ అలవాటు మిమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులకు వ్యాధులకు గురి చేస్తుందని మీకు తెలుసా…?అయితే ముక్కులో వేలు పెట్టుకునే ఈ అలవాటు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చాలామందికి ఉంటుంది. ఇక కొందరు బహిరంగంగాను మరికొందరు రహస్యంగాను ఈ అలవాటును చేస్తూ ఉంటారు. చాలా సందర్భాలలో ఎవరైనా ఇలా చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇక ఆ వ్యక్తి అలా చేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే సిగ్గుపడుతుండటం కూడా మనం గమనించే ఉంటాం. అసలు విషయానికొస్తే ఈ అలవాటు చాలా చెడ్డది. కానీ ఈ అలవాటు ఉన్నవారు మాత్రం దానిని అంత త్వరగా మానుకోలేరు.
కానీ ఇలా చేయడం వలన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని వైద్యులు తెలియజేస్తున్నారు. పదేపదే ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు కారణంగా సూక్ష్మక్రిములు నాసిక కొహరం లోకి ప్రవేశిస్తాయని ఇక ఇది అలర్జీ మరియు ఇతర వ్యాధికి దారి తీసే ప్రమాదం ఉందని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలియజేశారు. అదేవిధంగా తరచూ ఇలా ముక్కులో వేలు పెట్టుకునే వారికి అలర్జీ మల్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు ఈ అధ్యాయంలో వెల్లడించారు. ఈ అలవాటు కారణంగా వ్యాధికారకాలు మెదడులో బీటా అమిలాయిడ్ ను ఉత్పత్తి చేస్తాయట. దీని కారణంగా అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలియజేస్తున్నారు.
అలాగే మాటిమాటికి ముక్కులో వేలు పెట్టుకోవడం వలన వ్యాధికారక సూక్ష్మజీవులు ముక్కు ద్వారా మెదడుకు చాలా సులభంగా చేరుతాయని తెలియజేస్తున్నారు. వ్యాధికారక సిలింద్రాలు బ్యాక్టీరియా నాసిక కణాలకు సోకుతుందని అది చివరకు మెదడుకు చేరుతుందని కాబట్టి ఇలాంటి అలవాటు ఉన్నవారు వెంటనే మానుకోవాల్సిందిగా లేకపోతే తీవ్రమైన ఇబ్బందులను వ్యాధులను ఎదుర్కొంటారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి అలవాటు ఉన్నవారు వెంటనే మానుకోవడం మంచిది అని ఈ సందర్భంగా వైద్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.