Anise seeds : సోంపు గింజలతో అన్ని సమస్యలకు చెక్….

Anise seeds : సోంపు గింజల ప్రయోజనాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే చాలామంది ఈ సొంపును అన్నం తిన్న తర్వాత లేదా ఇతర సమయాలలో ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇలా తీసుకోవడం వలన ఆహారం సులువుగా జీర్ణం అవుతుందని నమ్మకం. అలాగే మరి కొంతమంది తాజా శ్వాస కోసం వీటిని తీసుకుంటారు. కానీ సోంపు గింజలని ఎవరు నీటిలో కలిపి తీసుకోరు. అయితే ఈ సోంపు గింజలను ప్రతిరోజూ ఉదయాన్నే నీటిలో కలిపి […]

  • Published On:
Anise seeds : సోంపు గింజలతో అన్ని సమస్యలకు చెక్….

Anise seeds : సోంపు గింజల ప్రయోజనాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే చాలామంది ఈ సొంపును అన్నం తిన్న తర్వాత లేదా ఇతర సమయాలలో ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇలా తీసుకోవడం వలన ఆహారం సులువుగా జీర్ణం అవుతుందని నమ్మకం. అలాగే మరి కొంతమంది తాజా శ్వాస కోసం వీటిని తీసుకుంటారు. కానీ సోంపు గింజలని ఎవరు నీటిలో కలిపి తీసుకోరు. అయితే ఈ సోంపు గింజలను ప్రతిరోజూ ఉదయాన్నే నీటిలో కలిపి తీసుకోవడం వలన అనేక రకాల లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బరువు తగ్గడానికి…

సోంపు గింజలలో యాంటీ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడతాయి. అదేవిధంగా దీనిలో ఫైబర్ మినరల్స్ వంటి శరీరానికి శక్తినిచ్చే పోషకాలు కూడా ఉన్నాయి. కావున బరువు తగ్గాలి అనుకునే వారు ప్రతి రోజు ఉదయాన్నే పరిగడుపున ఈ సోంపు నీళ్లను తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే ఇలా తీసుకోవడం వలన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగి సులువుగా బరువు తగ్గుతారు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

సోంపు గింజల్లో కార్మినేటివ్ అనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. అయితే ప్రతిరోజు ఉదయాన్నే సోంపు నీటిని తాగడం వలన దాంట్లో ఉండే ఎంజైమ్స్ జీర్ణ క్రియను వేగవంతం చేస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకే బిర్యానీ వంటి మసాలా ఐటమ్స్ తిన్న తర్వాత కచ్చితంగా సోంపు తినడానికి ఇస్తారు.

నోటి దుర్వాసన..

చాలామందిని నోటి దుర్వాసన సమస్య వేధిస్తూ ఉంటుంది. ఇక అలాంటివారు తాజా శ్వాస కోసం ప్రతిరోజు సోంపు గింజలను తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోంపు గింజల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బ్యాడ్ స్మెల్ రాకుండా దూరం చేస్తాయి.

మలబద్ధకం తగ్గుతుంది..

సోంపు గింజల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.ఇది ప్రేగులను ఆరోగ్యంగా ఉంచి మలబద్దక సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. కాబట్టి మలబద్ధక సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే సోంపు గింజలను తీసుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికి సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.