AP CM JAGAN : ” ఈసారి కూడా జగన్ నే గెలుస్తాడు ” కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దారెడ్డి .. ఫుల్ ఫైర్ లో చంద్రబాబు

AP CM JAGAN : ఆంధ్రాలో అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు మధ్య పోటా పోటీగా మాటల యుద్ధం జరుగుతుంది. ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉన్న ఇప్పటినుంచే ఏపీలో ఎన్నికలు గురించి చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఈసారి కూడా మాదే అధికారం అని చెబుతుంటే, లేదు మాదే అధికారం అని టీడీపీ చెబుతుంది. ఈ క్రమంలోనే సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం వలన ఆంధ్రాలో […]

  • Published On:
AP CM JAGAN : ” ఈసారి కూడా జగన్ నే గెలుస్తాడు ” కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దారెడ్డి .. ఫుల్ ఫైర్ లో చంద్రబాబు

AP CM JAGAN : ఆంధ్రాలో అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు మధ్య పోటా పోటీగా మాటల యుద్ధం జరుగుతుంది. ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉన్న ఇప్పటినుంచే ఏపీలో ఎన్నికలు గురించి చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఈసారి కూడా మాదే అధికారం అని చెబుతుంటే, లేదు మాదే అధికారం అని టీడీపీ చెబుతుంది. ఈ క్రమంలోనే సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం వలన ఆంధ్రాలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉంది అని చెప్పారు. ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుంది. ప్రతి నెల కుప్పంలో పార్టీ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు, చేరికలను ప్రోత్సహిస్తున్నారు.

తాజాగా మంత్రి పెద్దారెడ్డి అటవీశాఖ ప్రధాన కార్యాలయాన్ని మంగళగిరిలో ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఇంత గొప్ప పాలన ఎప్పుడు చూడలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవడంలేదని అన్నారు. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన ప్రజలు జగన్ వైపే ఉన్నారని ఆయన అన్నారు. ఈసారి కూడా జగన్ ముఖ్యమంత్రిగా గెలుస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదని ఆయన అన్నారు. కుప్పంలో దొంగ ఓట్లు ఉన్నాయంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇవ్వడానికి ఆయన సిద్ధమయ్యారు.

మంత్రి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఫుల్ ఫైర్ అవుతున్నారు. పుంగనూరులో మంత్రి పెద్దారెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తాను అని చాలెంజ్ చేశారు. దీనికి స్పందించిన పెద్దారెడ్డి తాను కుప్పం, పుంగనూరు రెండు చోట్ల సిద్ధమేనని.. చంద్రబాబు రెడీనా అని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కీలకమైన కుప్పం తో పాటు అనంతపురం జిల్లా బాధ్యతలను సీఎం జగన్ మంత్రి పెద్దారెడ్డికి అప్పగించారు. పెద్దారెడ్డి కొడుకు ఎంపీ మిథున్ రెడ్డికి గోదావరి జిల్లాల బాధ్యతలను అప్పగించారు. తండ్రి కొడుకులు ఇద్దరు 48 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ఈ సీట్లు చాలా ముఖ్యమని తెలుస్తుంది.

Must read : Reliance Jio : సేవలన్నీ ఉచితం..కొత్త రెండు అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించిన జియో.. !