AP Politics : ఈసారి కూడా జగన్ పక్క…తేల్చి చెప్పిన సర్వేలు…
AP Politics : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలలో మార్పులు వస్తున్నాయి.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం వైసిపి మరియు పొత్తు కుదుర్చుకున్న టిడిపి జనసేన పోటీ పడుతున్నాయి.అయితే తన సంక్షేమం తనకి అధికారం అందేలా చేస్తుందని జగన్ ధీమాగా ఉన్నారు. అదేవిధంగా జగన్ ప్రభుత్వం పై ప్రజలలో ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంచనా వేస్తున్నారు. బిజెపి వైఖరి ఇంకా తేలాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు […]
AP Politics : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలలో మార్పులు వస్తున్నాయి.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం వైసిపి మరియు పొత్తు కుదుర్చుకున్న టిడిపి జనసేన పోటీ పడుతున్నాయి.అయితే తన సంక్షేమం తనకి అధికారం అందేలా చేస్తుందని జగన్ ధీమాగా ఉన్నారు. అదేవిధంగా జగన్ ప్రభుత్వం పై ప్రజలలో ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంచనా వేస్తున్నారు. బిజెపి వైఖరి ఇంకా తేలాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల పల్స్ ఏంటనేది బయటపెట్టారు. దానికి సంబంధించిన ఫలితాలను బయటపెట్టారు. సిఫాలజిస్ట్ ఎన్నికల ఫలితాల విశ్లేషకులు పార్థ దాస్ అనే వ్యక్తి ఏపీలో ప్రజల పల్స్ ఏంటనే విషయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా నిర్వహించిన సర్వేలు ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు అనే విషయాలను బయటపెట్టారు. పార్థదాస్ వెల్లడించిన నివేదిక ప్రకారం చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకు వైసీపీ పైన 46% మద్దతు ఉంది.
అదేవిధంగా టిడిపి పార్టీకి 40% శాతం , జనసేనకు 11% అదేవిధంగా ఇతరులకు 1% మద్దతు ఉన్నట్లుగా తెలియజేశారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 48% మద్దతు ఉండగా టిడిపికి 43% మద్దతు ఉందని విశ్లేషించారు. అలాగే జనసేనకు 8% ప్రజల మద్దుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 1% మాత్రమే మద్దతు లభిస్తుంది అని తెలియజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారని సర్వే కూడా వెల్లడించడం జరిగింది. దీనిలో భాగంగా జగన్ ముఖ్యమంత్రి కావాలని 46% , చంద్రబాబు నాయుడు కు 36% లోకేష్ కు 8% , పవన్ కళ్యాణ్ కు 10% మంది కోరుకుంటున్నట్లుగా సర్వేలు నిర్ధారించాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రధానిగా మోడీకి 45% మద్దతు లభించగా, రాహుల్ గాంధీకి 39 శాతం మద్దతు లభించింది. ఇక మిగిలిన 19 శాతం ఎవరికి వారే తేల్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాయి సర్వేలు.
ఆంధ్రప్రదేశ్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలలో చేసిన ప్రజాభిప్రాయాల మేరకు ఈ ఫలితాలను విడుదల చేసినట్లుగా పార్థ దాసు వెల్లడించారు. అలాగే రాజమండ్రి సిటీ, శ్రీకాళహస్తి ,పెద్దపులిపాడు, నెల్లూరు నియోజకవర్గాల నుండి శాంపిల్స్ సేకరించినట్లుగా తెలియజేశారు. అయితే గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా పార్థ దాసు కాంగ్రెస్ కు అనుకూలంగా అంచనాలను వెల్లడించడం జరిగింది. ఇక ఇప్పుడు టిడిపి జనసేన వేరువేరుగా ప్రస్తావన చేసి ఫలితాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు పొత్తు ఖరారు చేసుకుని అధికారం కోసం పోటీ పడుతున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు కంటే జగన్ కు ప్రజలలో మద్దతు ఎక్కువగా లభిస్తుంది. అయితే ప్రతివారం ఇలాంటి సర్వేలను వెల్లడిస్తామని పార్థాదాస్ తెలియజేశారు. మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు, సామాజిక సమీకరణాలు ఏపీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలలో అంచనాలు తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి చివరి వరకు వేచి చూడాల్సిందే.
We will publish a weekly tracker for next #AndhraPradesh Election 2024. This is our 1st weekly tracker. Samples taken from 4 Assembly segments.
Vote% in Assembly Election :
YSRCP – 46%
TDP – 40%
Janasena – 11%
TDP/Janasena – 2%
Others -1%Vote% in Parliament Election :
YSRCP -…— Partha Das (@partha2019LS) December 11, 2023