Telangana Politics: కాంగ్రెస్‌కు మునుగోడులో ఎదురుదెబ్బ, టీఆర్‌ఎస్‌లోకి పల్లె రవికుమార్ గౌడ్‌ జంప్..

మునుగోడు ఉప ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గం ఓట్లు కీలకంగా మారాయి. మునుగోడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

  • Published On:
Telangana Politics: కాంగ్రెస్‌కు మునుగోడులో ఎదురుదెబ్బ, టీఆర్‌ఎస్‌లోకి పల్లె రవికుమార్ గౌడ్‌ జంప్..

Telangana Politics:

మునుగోడు ఉప ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గం ఓట్లు కీలకంగా మారాయి. మునుగోడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్న బూర నర్సయ్యగౌడ్‌ టీఆర్‌ఎస్‌కు షాకిచ్చి బీజేపీలోకి జంప్ అయ్యాడు కాంగ్రెస్‌కు అక్కడ కొలుకోలేని దెబ్బ తగిలింది.

కాంగ్రెస్‌ పార్టీ నేత పల్లె రవికుమార్‌ గౌడ్‌ దంపతులు టీఆర్‌ఎస్‌లో చేరారు.కేటీఆర్‌తో భేటీ అయిన రవికుమార్‌ భార్య జ్యోతిలు టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్నారు. ఇప్పుడు జ్యోతి చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. బూర నర్సయ్య గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు.

పల్లె రవికుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. చండూరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలన్న ప్రధానమైన ప్రజల కోరికను మంత్రి కేటీఆర్‌కు తెలియజేశానని, ఇందుకు మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మా వంతు కృషిని చేస్తామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు మర్రి రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.ఉద్యమ కాలం నుంచి మాతో కలిసి పని చేసిన రవికుమార్ అయన భార్య జ్యోతి మళ్లీ టీఆర్ఎస్ పార్టీ లోకి రావడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ అన్నారు. ఒకప్పటి స్నేహితుడు పల్లె రవికుమార్ కి కచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని మంచి రాజకీయ అవకాశాలను టీఆర్ఎస్ పార్టీ కల్పిస్తుందని అన్నారు.

Must Read: Vivo డ్రోన్ కెమెరా ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లు & లాంచ్ తేదీ ??