Revanth Reddy : తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి… ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే…

Revanth Reddy : తెలంగాణలో కొత్త సీఎం అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠత నెలకొంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే నిన్నటి నుండి జరుగుతున్న కొలిక్కి వచ్చినట్లు అర్థమవుతుంది. ఈరోజు ఉదయం కొత్త సిఎం అభ్యర్థి విషయంపై మల్లికార్జున కీలక ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం లోపు సీఎం అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని తెలియజేస్తామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు భట్టి విక్రమార్క ,ఉత్తంకుమార్ రెడ్డి ఢిల్లీకి […]

  • Published On:
Revanth Reddy : తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి… ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే…

Revanth Reddy : తెలంగాణలో కొత్త సీఎం అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠత నెలకొంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే నిన్నటి నుండి జరుగుతున్న కొలిక్కి వచ్చినట్లు అర్థమవుతుంది. ఈరోజు ఉదయం కొత్త సిఎం అభ్యర్థి విషయంపై మల్లికార్జున కీలక ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం లోపు సీఎం అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని తెలియజేస్తామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు భట్టి విక్రమార్క ,ఉత్తంకుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. వీరు మల్లికార్జునతో భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నెక్స్ట్ సీఎం ఎవరు అనేదానిపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే సీఎంగా రేవంత్ రెడ్డి పేరు దాదాపు కరారైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

telangana-new-cm-revanth-reddy-when-will-he-take-oath

అయితే సీఎం అభ్యర్థిగా రేవంత్ పేరును అటు ఎమ్మెల్యేలు బలపరచగా అధిష్టానం కూడా అదే దిశగా ఆలోచన చేస్తుంది. అయితే సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ అభ్యర్థులు వ్యతిరేకించడంతో అధికార ప్రకటన ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా కర్ణాటక పర్యటక శాఖ మంత్రి డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. డీకే శివకుమార్ సోదరుడు ఇంట్లో రేవంత్ రెడ్డి ని కలవడం జరిగింది. అయితే సీఎం రేసులో ఉన్న రేవంత్ రెడ్డి డీకే శివకుమార్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కర్కె నివాసంలో రాహుల్ ,వేణుగోపాల్, డి కె శివకుమార్ భేటీ అయ్యారు.

telangana-new-cm-revanth-reddy-when-will-he-take-oath

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే సీనియర్ అభ్యర్థులు చేస్తున్న డిమాండ్లపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే అగ్ర నేతల భేటీ అనంతరం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని ఈరోజు సాయంత్రం కల్లా తెలియజేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఉత్తంకుమార్ రెడ్డి కూడా సీఎం రేసులో ఉన్నట్లుగా మరోసారి గుర్తు చేసుకున్నారు. అలాగే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటారని తెలియజేశారు. ఇక ముఖ్యమంత్రి పదవికి నలుగురు పోటీ చేయడం తప్పేం కాదని పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అంగీకరిస్తామని ఆయన పేర్కొన్నారు.