Revanth Reddy : తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి….

Revanth Reddy  : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టిసి బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణం మరియు ఆరోగ్య భీమా పథకం కింద 10 లక్షల రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న .ఇది ఇలా ఉంటే తాజాగా మరో హామీ ని సిద్ధం […]

  • Published On:
Revanth Reddy : తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి….

Revanth Reddy  : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టిసి బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణం మరియు ఆరోగ్య భీమా పథకం కింద 10 లక్షల రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న .ఇది ఇలా ఉంటే తాజాగా మరో హామీ ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈనెల ఆఖరిలోగా ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని భావిస్తునట్లు సమాచారం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకి 25 వందలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీ ని అమలు చేయనున్నట్లు తెలుస్తుంది.

లోక్ సభ షెడ్యూల్ రాకముందే పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక మంత్రులతో చర్చించారని సమాచారం. వచ్చే నెలలో మహిళల ఖాతాలో డబ్బులు జమ చేసేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారని సమాచారం. అయితే ఇప్పటికే అర్హులు అయిన వారి దగ్గర నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే .ప్రస్తుతం ఈ సమాచారాన్ని అంతా డేటా ఎంట్రీ చేస్తున్నారు.త్వరలోనే వెరిఫికేషన్ చేస్తే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పటికే పథకాలు అమలులో ఉన్న వారిని పథకాలు నుండి తొలగిస్తారని సిఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.ఇప్పటికే లబ్ది పొందుతున్న వారికి యధావిధపొందుతున్న పథకాలు కొనసాగుతాయని ఎలాంటి చింతవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

https://youtu.be/wbo8YQNkx1s?si=BxOM7E0WtmdPOrug