Revanth Reddy : పది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన పనులు….

Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి పది రోజులు పూర్తయింది. పది రోజుల్లో ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. ఒకవైపు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే పరిపాలనను సంస్కరణలపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నారు. పాలకులము కాదు సేవకులు అంటూతమదైన శైలిలో ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దాదాపు 10 ఏళ్ల కేసీఆర్ పాలనను కట్టడించి ఈ నెల […]

  • Published On:
Revanth Reddy : పది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన పనులు….

Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి పది రోజులు పూర్తయింది. పది రోజుల్లో ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. ఒకవైపు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే పరిపాలనను సంస్కరణలపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నారు. పాలకులము కాదు సేవకులు అంటూతమదైన శైలిలో ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దాదాపు 10 ఏళ్ల కేసీఆర్ పాలనను కట్టడించి ఈ నెల 7 న స్టేడియం లో ప్రమాణస్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. ప్రమాణస్వీకరణం చేసే సమయంలోనే ప్రగతి భవన్ ముందు ఉన్న మొత్తం ఇనుప్పకంచెలను తీసేసారు. ప్రగతి భవన్ ను జ్యోతిబాయ్ పులే అంబేడ్కర్ పేరులు మార్చారు. ఇక దానికి విశేష స్పందన వచ్చింది.

cm-revanth-reddys-work-done-in-ten-days

అలాగే సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ లో ఉండకూడదు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ లో తన సొంత నివాసంలో ఉండే ప్రతిరోజు సచివాలయానికి వస్తున్నారు. సీఎంగా బాధితులు చేపట్టిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశారు. ఈ నెల 9న అసెంబ్లీ ఆవరణలోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద పదిలక్షల భరోసా కుడా అందించడం జరిగింది. అయితే ఇప్పుడు వివిధ ఉన్నత శాఖల అధికారులతో రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాలనలో తలదైనా మార్పు చూపే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ సీఎం భవనం వినియోగించుకొకపోవడమే కాక క్యాన్వై ను 8 నుండి 9 కి తగ్గించుకున్నారు. సొంత వాహనంలోనే తిరుగుతున్నారు. అలాగే తాను కారు లో వెళ్ళే సమయంలో ట్రాఫిక్ ను ఆపవద్దని ఆదేశాలు కుడా జారీ చేశారు.

సాధారణ వాహనాలు దారులతోనే తన కారు కూడా వెళ్ళేలా చూడాలని రేవంత్ ఆదేశించారు. అదేవిధంగా ఆడంబరాలు, అనవసర ఖర్చులు ఏమీ చేయవద్దు అని చెప్పారు. ఉన్న సదుపాయాలను పూర్తిగా వినియోగించుకుంటా అని చేపిన రేవంత్ రెడ్డి. అలాగే ఇప్పుడు టీఎస్పీఎస్ పై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి నీరుద్యోగులకు భరోసా కల్పించేలా యూపీఐ తరహాలో టిఎస్పిఎస్ ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టీఎస్పీఎస్ చైర్మన్ సభ్యులు రాజీనామా చేసేలా చూశారు. పోలీస్ కానిస్టేబుల్ హోంగార్డ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా తనదైనా స్టైల్ లో ప్రతిపక్ష పార్టీ అయినా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల పాలనలో తనదైన మార్క్ వేసుకుంటూ ప్రజలలో మంచి గుర్తింపును సాధిస్తున్నారని చెప్పాలి.