Revanth Reddy : కెసిఆర్ ను కలిసి పరామర్శించిన రేవంత్ రెడ్డి…

Revanth Reddy : తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించేందుకు యశోద హాస్పిటల్ కు చేరుకున్నారు. దీంతో కొత్త సీఎంపై ప్రజలలో మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఇటీవల కేసీఆర్ గారు తన ఇంట్లో కాలుజారి పడటంతో యశోద ఆసుపత్రికి తరలించిన విషయం అందరికీ తెలిసిందే. కింద పడడం వలన కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో తుంటి మార్పిడి శాస్త్ర చికిత్స యశోద హాస్పిటల్ లో నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ […]

  • Published On:
Revanth Reddy : కెసిఆర్ ను కలిసి పరామర్శించిన రేవంత్ రెడ్డి…

Revanth Reddy : తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించేందుకు యశోద హాస్పిటల్ కు చేరుకున్నారు. దీంతో కొత్త సీఎంపై ప్రజలలో మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఇటీవల కేసీఆర్ గారు తన ఇంట్లో కాలుజారి పడటంతో యశోద ఆసుపత్రికి తరలించిన విషయం అందరికీ తెలిసిందే. కింద పడడం వలన కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో తుంటి మార్పిడి శాస్త్ర చికిత్స యశోద హాస్పిటల్ లో నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి చేరుకుని కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్ ను కలిసి ఆయనకు నమస్కరించి పరామర్శించారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

cm-revanth-reddy-visits-kcr-in-yashoda-hospital

దాదాపు రేవంత్ రెడ్డి 15 నిమిషాల పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితుల గురించి చర్చించారు.  అదేవిధంగా కేటీఆర్ తో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని తిరిగి అసెంబ్లీకి తప్పకుండా రావాలని కోరుకుంటున్నట్లుగా తెలియజేశారు. కెసిఆర్ సూచనలు సలహాలు మాకు చాలా అవసరం అని ఆయన తెలియజేశారు. అయితే కేసీఆర్ ను కలిసేందుకు వెళ్లే సమయంలో ముందుగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ తో కలిసి లోపలికి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ భుజం పై సీఎం రేవంత్ చేయవేసి మాట్లాడుతూ లోపలికి తీసుకెళ్లారు. కేటీఆర్ కు ధైర్యం చెబుతూ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

cm-revanth-reddy-visits-kcr-in-yashoda-hospital
అదేవిధంగా కెసిఆర్ కు ఆరోగ్యం పరంగా పూర్తి సహాయ సహకారాలు అందించాలని అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి వైద్యులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఆసుపత్రి సిబ్బంది కూడా కెసిఆర్ ఆరోగ్యం గురించి ప్రతిరోజు బులిటెన్ విడుదల చేయాలని సూచించారు. అయితే ప్రస్తుతం కెసిఆర్ గారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రస్తుతం ఆయన వాకర్ సహాయంతో నడిచేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అభిమానులు కూడా కేసీఆర్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకొని రావాలని కోరుకుంటున్నారు.అయితే పార్టీల పరంగా ఎంత వైరం ఉన్నప్పటికీ ఇలాంటి కష్ట సమయాల్లో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించడం ప్రజలకు బాగా నచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డిని అందరూ ప్రశంసలతో ముంచేస్తున్నారు. దీంతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కలిసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.