Telangana : దసరా సెలవు దినాల్లో మార్పు…స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం…

Telangana  : దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 23 ,24 తేదీలను సెలవు దినాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ రెండు రోజుల్లో ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవు ఉంటుందని ఇటీవల కెసిఆర్ సర్కార్ జీవో జారీ చేసింది. అయితే దీనిలో 25వ తేదీని మాత్రం ఆప్షన్ హాలిడేగా ప్రకటించింది. అయితే వాస్తవానికి పండుగ సమయంలో కొంత సందిగ్ధం నెలకొంది. పండుగ ఏ రోజు జరుపుకోవాలనేది కాస్త తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ […]

  • Published On:
Telangana : దసరా సెలవు దినాల్లో మార్పు…స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం…

Telangana  : దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 23 ,24 తేదీలను సెలవు దినాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ రెండు రోజుల్లో ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవు ఉంటుందని ఇటీవల కెసిఆర్ సర్కార్ జీవో జారీ చేసింది. అయితే దీనిలో 25వ తేదీని మాత్రం ఆప్షన్ హాలిడేగా ప్రకటించింది. అయితే వాస్తవానికి పండుగ సమయంలో కొంత సందిగ్ధం నెలకొంది. పండుగ ఏ రోజు జరుపుకోవాలనేది కాస్త తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ విద్వత్ సభ అక్టోబర్ 23 దసరా పండుకున్న జరుపుకోవాలని సూచించింది.

ఈ క్రమంలోనే ప్రభుత్వం విజయదశమి వేడుకలకు సెలవులను ప్రకటించింది. మరోవైపు పాఠశాల విద్యార్థులకు కూడా సెలవులు ప్రకటించింది. విద్యార్థులతో పాటు మిగతా వారికి కూడా అక్టోబర్ 23 ,24 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలో బతుకమ్మ ప్రారంభం రోజు అక్టోబర్ 14న సాధారణ నెలవుగా ప్రకటించగా ,దుర్గాష్టమి రోజు అక్టోబర్ 22 అందరికీ సెలవు ప్రకటించింది.

అయితే ఈ పండుగ నేపద్యంలో పాఠశాలకు దాదాపు 13 రోజులు సెలవులు ఇవ్వగా జూనియర్ కాలేజీలకు ఏడు రోజులు సెలవులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకారం అక్టోబర్ 19 నుండి 25 వరకు కాలేజీలకు సెలవు దినాలు. అనంతరం అక్టోబర్ 26 నుండి జూనియర్ కాలేజీలు ప్రారంభమవుతాయి. ఇక ఈ సెలవు దినాలలో ఇంటర్ విద్యార్థులకు ఎలాంటి ప్రత్యేక తరగతులను నిర్వహించవద్దని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.