Telangana : ఒక్కొక్కరి ఖాతాలో 1.53 లక్షలు…దసరాకు కెసిఆర్ సర్కార్ భారీ కానుక…

Telangana : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ అదిరిపోయే వార్తను వినిపించారు. దసరా పండుగ సందర్భంగా కార్మికులకు భారీ బోనస్ ప్రకటించారు. అయితే ముందుగా మాట ఇచ్చిన ప్రకారం 2022 నుండి 2023 సంవత్సరం వరకు అర్జించిన లాభాలలో గా తేడాది కంటే ఎక్కువగా 32 శాతం వాటాను కార్మికులకు చెల్లించేందుకు నిధులను విడుదల చేశారు. అయితే 2022 నుండి 2023 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ రికార్డ్ స్థాయిలో రూ.2,282 కోట్ల లాభాలను అర్జించింది. […]

  • Published On:
Telangana : ఒక్కొక్కరి ఖాతాలో 1.53 లక్షలు…దసరాకు కెసిఆర్ సర్కార్ భారీ కానుక…

Telangana : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ అదిరిపోయే వార్తను వినిపించారు. దసరా పండుగ సందర్భంగా కార్మికులకు భారీ బోనస్ ప్రకటించారు. అయితే ముందుగా మాట ఇచ్చిన ప్రకారం 2022 నుండి 2023 సంవత్సరం వరకు అర్జించిన లాభాలలో గా తేడాది కంటే ఎక్కువగా 32 శాతం వాటాను కార్మికులకు చెల్లించేందుకు నిధులను విడుదల చేశారు. అయితే 2022 నుండి 2023 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ రికార్డ్ స్థాయిలో రూ.2,282 కోట్ల లాభాలను అర్జించింది. కాగా దీనిలో 32 శాతం అంటే రూ.711 కోట్లను దసరా బోనస్ గా కార్మికులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

1-53-lakhs-in-each-account-kcr-sarkars-huge-gift-for-dussehra

అయితే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఈరోజు బోనస్ నిధులను విడుదల చేశారు. ఇక ఈ బోనస్ డబ్బులు ఈనెల 16వ తేదీన సింగరేణి కార్మికుల అకౌంట్లోకి జమ కానున్నాయి . అయితే సగటున ఒక్కో కార్మికుడి అకౌంట్లో ₹1.53 లక్షల రూపాయలు బోనస్ పడబోతున్నట్లు అధికారులు అంచనా వేశారు. కాగా పెద్ద ఎత్తున పండగ పూట బోనస్ ప్రకటించడంతో సింగరేణి కార్మికులు పట్టలేని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల కార్మికులకు 11వ వేత్తనానికి సంబంధించినచిన 23 నెలల బకాయిలను కార్మికులకు ప్రభుత్వం చెల్లించింది.

1-53-lakhs-in-each-account-kcr-sarkars-huge-gift-for-dussehra

ఈ మేరకు సుమారు రూ.1450 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది. అయితే ఆ మధ్య మంచిర్యాల సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మునుపెన్నడు లేని విధంగా కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తానని ప్రకటించాడు. ఇక దానికి తగ్గట్టుగా గతంలో ఇచ్చిన వాటా కంటే ఎక్కువగా ఏకంగా 32 శాతం వాటాను కార్మికులకు ప్రకటించారు. దీంతో ఈ ఏడాది కార్మికుల మోఖాలలో రెట్టింపు సంతోషం కనిపిస్తుంది. కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.