Telangana Politics : జనాల్లో మార్కులు కొట్టేసేందుకు కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్న తెలంగాణ పార్టీలు ..

Telangana Politics : తెలంగాణలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న ఇప్పటి నుంచే జోరు కొనసాగుతుంది. అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తమ పార్టీని గెలిపించమని జనాలను కోరుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి అన్ని పార్టీలు జైశ్రీరామ్ అని నినాదంతో తిరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. హిందుత్వం ఎజెండాను పార్టీలోకి తీసుకొస్తున్నాయి. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో ఉన్న రేవంత్‌ రెడ్డి […]

  • Published On:
Telangana Politics : జనాల్లో మార్కులు కొట్టేసేందుకు కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్న తెలంగాణ పార్టీలు ..

Telangana Politics : తెలంగాణలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న ఇప్పటి నుంచే జోరు కొనసాగుతుంది. అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తమ పార్టీని గెలిపించమని జనాలను కోరుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి అన్ని పార్టీలు జైశ్రీరామ్ అని నినాదంతో తిరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. హిందుత్వం ఎజెండాను పార్టీలోకి తీసుకొస్తున్నాయి. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో ఉన్న రేవంత్‌ రెడ్డి భద్రాచలం శ్రీరాముడి ఆలయం సాక్షిగా కీలక కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెయ్యి కోట్లతో శ్రీరాముడి ఆలయాలు కట్టిస్తాం అన్నారు. అయితే కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కొనేందుకు హిందుత్వ అజెండాను తెరపైకి తీసుకొస్తుందని అనిపిస్తుంది. ఇప్పటికే ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య వార్ జరుగుతుంది. హిందుత్వం పేరు చెప్పి జనాలలో మార్కులు కొట్టేస్తున్నారు బీజేపీ నాయకులు. దీంతో అన్ని పార్టీలు హిందుత్వ అజెండాను ఉపయోగించుకుంటున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటువైపు కేసీఆర్ కూడా ఆలయాలపై పూర్తి దృష్టి పెట్టారు. ఇప్పటికే యాదాద్రిని పూర్తి చేశారు. ఇప్పుడు కొండగట్టు పై ఫోకస్ పెట్టారు.

600 కోట్లతో దేశంలోని అతిపెద్ద ఆంజనేయ స్వామి గుడిని నిర్మిస్తామని తెలిపారు. బీజేపీకి బీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ కూడా హిందుత్వ నినాదం చేస్తుంది. నియోజకవర్గానికి గుడి కాన్సెప్ట్ ని బాగా ఉపయోగించుకుంటున్నారు. హిందుత్వ విషయంలో బీజేపీ పక్కాగా ప్లాన్ చేసుకుంది. జైశ్రీరామ్ నినాదం విషయంలో బిజెపి ఏమాత్రం వెనక్కి తగ్గేటట్లు లేదు. బిజెపికి తగ్గట్టుగా టిఆర్ఎస్ పార్టీ ఆలయాల అభివృద్ధితో గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఈ రెండు పార్టీలను చూసి కాంగ్రెస్ పార్టీ కూడా జైశ్రీరామ్ అనే నినాదం ఎత్తుకుని జనాలలో మార్కులు కొట్టేస్తుంది.

Must Read : Pooja Hegde : సినీ అవకాశాల కోసం ఆ ‘ చెత్త పని ‘ చేయనున్న పూజా హెగ్డే .. ఈ పనికి ఎలా ఒప్పుకున్నావ్ తల్లీ !!