Telangana Govt : వందల కోట్లు విలువచేసే ప్రభుత్వ ఆస్తులను విక్రయించిన తహసిల్దారు.. కఠిన శిక్ష వేయాలంటూ ఆదేశాలు జారి..

Telangana Govt : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వేనెంబర్ 151 లొని 42 ఎకరాల ప్రభుత్వ భూమిని మహేశ్వరంమండలానికి చెందిన మాజీ తహసిల్దార్ జ్యోతి ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డికిి అప్పనంగా రాసి ఇచ్చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి, కోర్టును ఆశ్రయించి జరిగిన విషయాన్ని తెలియజేయగా,XVII అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల ప్రకారం మహేశ్వరం మండలానికి చెందిన సీఐ మధుసూదన్ సెక్షన్ నెంబర్ […]

  • Published On:
Telangana Govt : వందల కోట్లు విలువచేసే ప్రభుత్వ ఆస్తులను విక్రయించిన తహసిల్దారు.. కఠిన శిక్ష వేయాలంటూ ఆదేశాలు జారి..

Telangana Govt : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వేనెంబర్ 151 లొని 42 ఎకరాల ప్రభుత్వ భూమిని మహేశ్వరంమండలానికి చెందిన మాజీ తహసిల్దార్ జ్యోతి ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డికిి అప్పనంగా రాసి ఇచ్చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి, కోర్టును ఆశ్రయించి జరిగిన విషయాన్ని తెలియజేయగా,XVII అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల ప్రకారం మహేశ్వరం మండలానికి చెందిన సీఐ మధుసూదన్ సెక్షన్ నెంబర్ 420, 176 కింద తాసిల్దార్ జ్యోతి మరియు విఐపిఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.

వీరిద్దరిపై కేసు నమోదు చేయడమే కాక తెలంగాణ హైకోర్టు WP37146/2022ద్వారా విచారణ కొనసాగిస్తున్నారు . ఇదిలా ఉండగా భూముల విషయంపై తహసిల్దార్ పై కేసు నమోదు అవ్వడం తెలంగాణలో ఇదే మొదటిసారి కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే మహేశ్వరం పోలీసులు మాత్రం ఈ విషయంపై అంతగా స్పందించడం లేదని చెప్పాలి. అయితే ఈ కేస్ కోర్టులో ఉండడం వలన తమ జోక్యం చేసుకోలేమని పోలీసులు స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం తాసిల్దార్ గా పనిచేస్తున్న మహమ్మద్ అలి మాట్లాడుతూ నాగారంలోని సర్వే నెంబర్ 181 విషయం మా దృష్టికి వచ్చిందని, ఆ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి

వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వందల కోట్ల విలువ చేసే 42 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా విక్రయించినందుకు మహేశ్వరం మాజీ తాసిల్దార్ ఆర్.పి. జ్యోతి పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారిపై ఎఫ్ఐఆర్ వీడియో నెంబర్ 83/2023 కింద వారిపై కేసు నమోదు అయిందని తెలియజేశారు . ఒక ప్రభుత్వ అధికారి ఇలా చేయడం చూసి నేటి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇలా గవర్నమెంట్ ఆస్తులను అప్పనంగా ఇచ్చే వాళ్ళకి బుద్ధి రావాలని మళ్ళీ ఇలాంటి పనులు చేయాలంటే భయపడేలా శిక్ష వేయాలని కోర్టు వారిని కోరుతున్నారు.