Breaking News : అమ్మాయిలను లైంగికంగా వేధించిన అబ్బాయిలు .. బట్టలు ఊడదీసి కొట్టిన యువతులు ..

Breaking News : ఒంగోలు లో అద్దంకి బస్టాండ్ దగ్గర పెద్ద గొడవ జరిగింది. ఓ హోటల్ లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఐదుగురు యువతలపై స్కూటీ మీద వచ్చిన ఇద్దరు లైంగికంగా వేధించారు. దీంతో తిరగబడ్డ అమ్మాయిలు తమ సహచరుల సాయంతో వాళ్ళని పట్టుకొని చితక బాదారు. ఆ తర్వాత యువతుల సహచరులకు స్థానిక యువకుల చెందిన వారికి మధ్యపెద్ద గొడవ జరిగింది. ఇరు వర్గాలు రోడ్డుపై బీభత్సంగా కొట్టుకున్నారు. దీంతో యువతులు తమ […]

  • Published On:
Breaking News : అమ్మాయిలను లైంగికంగా వేధించిన అబ్బాయిలు .. బట్టలు ఊడదీసి కొట్టిన యువతులు ..

Breaking News : ఒంగోలు లో అద్దంకి బస్టాండ్ దగ్గర పెద్ద గొడవ జరిగింది. ఓ హోటల్ లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఐదుగురు యువతలపై స్కూటీ మీద వచ్చిన ఇద్దరు లైంగికంగా వేధించారు. దీంతో తిరగబడ్డ అమ్మాయిలు తమ సహచరుల సాయంతో వాళ్ళని పట్టుకొని చితక బాదారు. ఆ తర్వాత యువతుల సహచరులకు స్థానిక యువకుల చెందిన వారికి మధ్యపెద్ద గొడవ జరిగింది. ఇరు వర్గాలు రోడ్డుపై బీభత్సంగా కొట్టుకున్నారు. దీంతో యువతులు తమ సహచరులు రెస్టారెంట్లోకి వెళ్లి దాక్కున్నారు. అయినా యువకులు విడిచి పెట్టకుండా రెస్టారెంట్ పై దాడి చేశారు.

అర్ధరాత్రి దాదాపు గంట పాటు రోడ్డుపై బీభత్సం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ఇరువర్గాలని చెదరగొట్టారు. ఈ గొడవలో యువతి యువకులకు పలు గాయాలయ్యాయి. ఒక యువతికి బాగా గాయాలు తగలడంతో స్పృహ తప్పి పడిపోయింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ సంఘటనపై యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి నడిరోడ్డుపై జరిగిన సంఘటనను కొంతమంది ఫోన్లలో రికార్డు చేసారు, మరికొన్న విజువల్స్‌ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.

గతంలో కూడా ఇదే విధంగా కొంతమంది యువకులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఈ విధమైన దాడులు జరుగుతున్నాయని, తమకు పోలీసులు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. ఒంగోలులో హోటల్‌ లో ఉద్యోగాలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువతుల పట్ల స్థానిక యువకులు దాడులు చేయడం, లైంగికంగా వేధింపులకు పాల్పడటం పరిపాటిగా మారిందని హోటల్‌ యజమాని వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు రెస్టారెంట్లలో పనిచేసే యువతులకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. ఒంగోలు లో జరిగిన ఈ ఘర్షణకు సంబంధించి సిసి కెమెరా పుటేజ్‌ను పోలీసులు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామంటున్నారు. నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేస్తామన్నారు.

Must Read : Earth Quake: భారీ భూకంపంతో 23 వేల మంది మృతి .. తవ్వుతున్న కొద్ది బయటపడుతున్న శవాలు ..