Breaking News : మాజీ ప్రియుడి కోసం మొగుడికి విడాకులు ఇచ్చి వచ్చిన యువతి .. చివరికి ఊహించని షాక్ ..

Breaking News : బోరబండ రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి టెలి కాలర్ గా పనిచేసింది. ఈ క్రమంలోనే ఆమెకు మహారాష్ట్రకు చెందిన సైఫ్ అనే వ్యక్తితో ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆ యువకుడు మహారాష్ట్ర నుంచి ఆమె కోసం హైదరాబాద్ వచ్చాడు. సైఫ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి కొన్నాళ్లపాటు ఆమెతో సహజీవనం చేశాడు. అయితే 2020లో ఆ యువతికి కుటుంబ సభ్యులు […]

  • Published On:
Breaking News : మాజీ ప్రియుడి కోసం మొగుడికి విడాకులు ఇచ్చి వచ్చిన యువతి .. చివరికి ఊహించని షాక్ ..

Breaking News : బోరబండ రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి టెలి కాలర్ గా పనిచేసింది. ఈ క్రమంలోనే ఆమెకు మహారాష్ట్రకు చెందిన సైఫ్ అనే వ్యక్తితో ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆ యువకుడు మహారాష్ట్ర నుంచి ఆమె కోసం హైదరాబాద్ వచ్చాడు. సైఫ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి కొన్నాళ్లపాటు ఆమెతో సహజీవనం చేశాడు. అయితే 2020లో ఆ యువతికి కుటుంబ సభ్యులు మరో వివాహం చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ యువతి దుబాయ్ కి వెళ్ళిపోయింది.

ఈ సమయంలోనే సైఫ్ మళ్లీ ఆమె కాంటాక్ట్ లోకి వచ్చాడు. భర్తకు విడాకులు ఇచ్చి రావాలని, తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో సైఫ్ మాటలు నమ్మిన ఆ యువతి ముందు వెనక ఆలోచించకుండా భర్తను వదిలేసి హైదరాబాద్ కు వచ్చింది. అనంతరం ఆమెకు గర్భస్రావం కూడా చేయించాడు. ఇలా కొంతకాలం కలిసి ఉండి తన సొంత ఊరుకు వెళ్ళిపోయాడు సైఫ్. ఈనెల 22న మరొక యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆయవతి సైఫ్ స్వగ్రామానికి వెళ్లి నిలదీసింది.

సైఫ్ అందుకు నిరాకరించాడు. సైఫ్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు కూడా ఆమెపై మాటల యుద్ధానికి దిగారు. దీంతో ఏం చేయలేని ఆ యువతి తిరిగి హైదరాబాద్ కు వచ్చింది. సైఫ్ పై ఎస్సార్ నగర్లో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనం నిత్యం టీవీ, న్యూస్ పేపర్లలో ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. చాలామంది సోషల్ మీడియా ద్వారా పరిచయమై ఆ తర్వాత ప్రేమతో ఒకటై దారుణంగా మోసపోతున్నారు. అయినా ఏమాత్రం అప్డేట్ కాకుండా అంతే మోసపోతున్నారు.

Must Read : YCP MLA kotam Reddy : సొంత పార్టీ ఎమ్మెల్యేతో జగన్ కి పెద్ద ముప్పు .. వైసీపీ కి సవాల్ విసురుతున్న కోటంరెడ్డి ..