Hyderabad : మండి బిర్యానీ తిని 45 మంది అస్వస్థత…రెస్టారెంట్ మూసివేత…

Hyderabad : హైదరాబాద్ మహానగరంలోని ఎమ్మెస్ మండి హోటల్లో మండి తిని పలువురు అస్వస్థతకు గురయ్యారని ఆరోపణలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎం ఎస్ హోటల్ మూసివేసిన ఘటన నవంబర్ 19న హైదరాబాదులో చోటుచేసుకుంది.అయితే దీనిపై స్థానిక సామాజిక కార్యకర్త అజ్మత్ జాఫరీ జిహెచ్ఎంసి కు ఫిర్యాదు చేయగా వెంటనే వచ్చిన అధికారులు హోటలను సందర్శించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హోటల్ నుండి దాదాపు 45 మంది వ్యక్తులు హోటల్లో మండిని […]

  • Published On:
Hyderabad : మండి బిర్యానీ తిని 45 మంది అస్వస్థత…రెస్టారెంట్ మూసివేత…

Hyderabad : హైదరాబాద్ మహానగరంలోని ఎమ్మెస్ మండి హోటల్లో మండి తిని పలువురు అస్వస్థతకు గురయ్యారని ఆరోపణలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎం ఎస్ హోటల్ మూసివేసిన ఘటన నవంబర్ 19న హైదరాబాదులో చోటుచేసుకుంది.అయితే దీనిపై స్థానిక సామాజిక కార్యకర్త అజ్మత్ జాఫరీ జిహెచ్ఎంసి కు ఫిర్యాదు చేయగా వెంటనే వచ్చిన అధికారులు హోటలను సందర్శించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హోటల్ నుండి దాదాపు 45 మంది వ్యక్తులు హోటల్లో మండిని తిని ,

45-people-fell-ill-after-eating-mandi-biryani-restaurant-closed

అలాగే ఇంటికి పార్సిల్ తీసుకెళ్లినవారికి వాంతులు అవడం తో వారిని హైదరాబాదులోని పలు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఎం ఎస్ మండి హోటల్ పై ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ ని పరిశీలించి మైనస్ లేదా మండి బియ్యం కలుషితమయ్యే అవకాశం ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేసింది. దానికి సంబంధించిన నమూనాలను విశ్లేషణకు పంపించారని , తదుపరి నోటీసులు వచ్చేంతవరకు హోటల్ ను మూసివేయాల్సిందిగా యాజమాన్యానికి సూచించారు.

45-people-fell-ill-after-eating-mandi-biryani-restaurant-closed

 

అలాగే పరిశుభ్రత పాటించడంలో విఫలమైనందుకు ఆహార భద్రత నియమాలను ఉల్లంఘించినందుకు గాను హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా బాధిత వ్యక్తులు కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మీరు చౌక్ పోలీస్ స్టేషన్ లో హోటల్ పై ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఈ వార్త ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చానీయంశంగా మారింది.