Hyderabad : భారమైన హృదయంతో చిన్నారి కోరికను నెరవేర్చిన తల్లిదండ్రులు…

Hyderabad  : పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు దేశాన్ని జయించిన అంత సంతోషంగా ఫీల్ అవుతుంటారు. అలాంటిది వారి కళ్ళముందే తన బిడ్డ చనిపోతుందంటే ఆ బాధను భరించడం వర్ణాతీతం. ఇక ఆ బాధను ప్రపంచంలో ఎవరూ కూడా తీర్చలేరు. అలా అని వారి మరణాన్ని కూడా ఆపలేరు. కానీ చనిపోయే ముందు చివరిగా వారి చివరి కోరికనైనా తీర్చుదామని చాలామంది ప్రయత్నిస్తుంటారు. అయితే తాజాగా గుంటూరుకు చెందిన తల్లిదండ్రులకు తన కొడుకు విషయంలో ఇదే పరిస్థితి ఎదురైంది. […]

  • Published On:
Hyderabad : భారమైన హృదయంతో చిన్నారి కోరికను నెరవేర్చిన తల్లిదండ్రులు…

Hyderabad  : పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు దేశాన్ని జయించిన అంత సంతోషంగా ఫీల్ అవుతుంటారు. అలాంటిది వారి కళ్ళముందే తన బిడ్డ చనిపోతుందంటే ఆ బాధను భరించడం వర్ణాతీతం. ఇక ఆ బాధను ప్రపంచంలో ఎవరూ కూడా తీర్చలేరు. అలా అని వారి మరణాన్ని కూడా ఆపలేరు. కానీ చనిపోయే ముందు చివరిగా వారి చివరి కోరికనైనా తీర్చుదామని చాలామంది ప్రయత్నిస్తుంటారు. అయితే తాజాగా గుంటూరుకు చెందిన తల్లిదండ్రులకు తన కొడుకు విషయంలో ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే తాజాగా వారి కొడుకుకు క్యాన్సర్ ఉందని వైద్యుల నిర్ధారించడం జరిగింది. ఇక వారి బాబును కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం మాత్రం లభించలేదు. చివరికి చేసేదేం లేక భారమైన గుండెలతో ఆ చిన్నారి చివరి కోరికను తీర్చే దిశగా తల్లిదండ్రులు ఆలోచించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే…

గుంటూరుకు చెందిన అనుపోజు బ్రహ్మం లక్ష్మీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో రెండవ కుమారుడు మోహన్ సాయి ( 7) నాలుగో తరగతి చదువుతున్నాడు. అయితే గత సంవత్సరం పాఠశాల సెలవుల సమయంలో మోహన్ సాయి తీవ్ర అనారోగ్యం పాలవడంతో డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించి చిన్నారికి క్యాన్సర్ ఉన్నట్టుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో గత సంవత్సరం నుండి మోహన్ సాయి బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి కావడంతో రోజులు గడుస్తున్న కొద్ది చిన్నారి ఆరోగ్యం మరింత విశమిస్తూ వస్తుంది. దీంతో చిన్నారి బతకడం కష్టతరమవుతుందని అతనికి చివరి రోజులు దగ్గర పడ్డాయని ఈ క్రమంలోనే చిన్నారి చివరి కోరిక తీర్చాలని డాక్టర్లు సూచించారు.

అయితే చిన్నారికి ఎప్పటినుండో పోలీసు అధికారి కావాలని కోరిక ఉండేదట. ఇక చిన్నారి కోరికను తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది మేక్ ఏ ఫౌండేషన్ సభ్యులతో కలిసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి అతని కోరికను నెరవేర్చారు. చిన్నారికి పోలీస్ గెటప్ వెయించి స్టేషన్ కు సాధరంగా ఆహ్వానించి పోలీస్ అధికారి కుర్చీలో కూర్చోబెట్టి అతని చివరి కోరికను నెరవేర్చారు. అలాగే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకీర్ ఓపెన్ చిన్నారికి పోలీస్ గౌరవ వందనం చేసి చిన్నారి నుండి కూడా గౌరవ వందన స్వీకరించాడు. అనంతరం అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ చిన్నారికి పోలీస్ స్టేషన్లో జరిగే పని విధానం గురించి కూడా వివరించడం జరిగింది. అనంతరం చిన్నారికి సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఇతర సిబ్బంది బహుమతులు అందజేశారు.