Hyderabad : ప్రవళిక పేరెంట్స్ తో ప్రగతి భవన్ లో మాట్లాడుతున్న కేసీఆర్…

Hyderabad  : అక్టోబర్ 13వ తేదీ శుక్రవారం రోజు వరంగల్ కు చెందిన మర్రి ప్రవళిక అనే అమ్మాయి చిక్కడపల్లిలోని బృందావన్ గర్ల్ హాస్టల్లో ఉరివేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. అయితే గత రెండేళ్లుగా అశోక్ నగర్ లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడంతో నిరుద్యోగులు , విద్యార్థులు ,విద్యార్థి సంఘాలు పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా చిక్కడపల్లి చేరుకొని నిరసనలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం […]

  • Published On:
Hyderabad : ప్రవళిక పేరెంట్స్ తో ప్రగతి భవన్ లో మాట్లాడుతున్న కేసీఆర్…

Hyderabad  : అక్టోబర్ 13వ తేదీ శుక్రవారం రోజు వరంగల్ కు చెందిన మర్రి ప్రవళిక అనే అమ్మాయి చిక్కడపల్లిలోని బృందావన్ గర్ల్ హాస్టల్లో ఉరివేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. అయితే గత రెండేళ్లుగా అశోక్ నగర్ లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడంతో నిరుద్యోగులు , విద్యార్థులు ,విద్యార్థి సంఘాలు పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా చిక్కడపల్లి చేరుకొని నిరసనలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన చేయడం తో పోలీసులు ఆందోళన కారుల పై లాఠీచార్జి కూడా చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

kcr-talking-to-pravalikas-parents-at-pragati-bhavan

 

ఈ క్రమంలో పలు రాజకీయ నాయకులు ప్రవళిక మృతిపై స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఆరోపించారు. మరోవైపు ప్రవళిక మృతిపై నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో చిక్కడపల్లి సిఐని కూడా సస్పెండ్ చేయడంం జరిగింది. అయితే ఇది ఇలా కొనసాగుతుండగా ప్రవళిక ప్రభుత్వ ఉద్యోగం రాలేదని సూసైడ్ చేసుకోలేదు…దానికి గల కారణాలు వేరే ఉన్నాయని కూడా వార్తలు ప్రచారం జరిగాయి. ఈ నేపథ్యంలో సిటీ కమిషనర్ కూడా ప్రవళిక మృతిపై స్పందించి ఆమె ఎవరితోనో ఫోన్స్ ఎక్కువసేపు మాట్లాడినట్లు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అందుకే ఆమె సూసైడ్ చేసుకుంది..

ఆమె అసలు గ్రూప్4 ఎగ్జామ్స్ కి అప్లై చేయలేదని కూడా వార్తలు ప్రచారం జరిగాయి. ఇది ఇలా ఉండగా ఇటీవల వరంగల్ కు చెందిన ప్రవళిక తల్లిదండ్రులను నర్సంపేట పోలీసులు ప్రగతి భవన్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.భారీ బందోబస్తు నడుమ వారిని హైదరాబాద్ కు తీసుకువచ్చి ప్రగతి భవన్ కు తీసుకెళ్లినట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అయితే ప్రవళిక పేరెంట్స్ తో సీఎం కేసీఆర్ పర్సనల్ గా మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రవళిక పేరెంట్స్ ను ఇలా భారీ బందోబస్తు నడుమ తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిలో నిజం ఎంత ఉందొ తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.