Hyderabad : హైదరాబాదులో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత….

Hyderabad  : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్లలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. బాలానగర్ ఎస్ఓటి పోలీసుల తనిఖీలలో 400 కేజీల ఎండు గంజాయి బయటపడింది. నర్సరీ మొక్కల కింద కనిపించకుండా దాచిన గంజాయిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి వెలికి తీశారు. అయితే ఈ గంజను రాజమండ్రి నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే బాలానగర్ జోన్ డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ…ఈ ఆపరేషన్లో భాగంగా ఒక 400 కేజీలకు గంజాయిని స్వాధీనం […]

  • Published On:
Hyderabad  : హైదరాబాదులో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత….

Hyderabad  : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్లలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. బాలానగర్ ఎస్ఓటి పోలీసుల తనిఖీలలో 400 కేజీల ఎండు గంజాయి బయటపడింది. నర్సరీ మొక్కల కింద కనిపించకుండా దాచిన గంజాయిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి వెలికి తీశారు. అయితే ఈ గంజను రాజమండ్రి నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే బాలానగర్ జోన్ డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ…ఈ ఆపరేషన్లో భాగంగా ఒక 400 కేజీలకు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తేలియజేసారు. అలాగే ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్స్ అయినటువంటి మధ్యప్రదేశ్ కు చెందినటువంటి బబ్లు మరియు గోవింద్ అనేటువంటి ఇద్దరు స్మగ్లర్లను పట్టుకోవడం జరిగిందని. అయితే ప్రస్తుతం వీరిద్దరూ మధ్యప్రదేశ్ లో ఉన్నారని ఆయన తెలిపారు.

వీరిద్దరూ లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ గా పనిచేస్తూ ఉంటారు.అయితే వీరిద్దరూ రాజమండ్రి ఏరియాలో ఈ గంజాయిని లోడ్ చేయడం జరిగింది . అక్కడినుండి గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా మనకు సమాచారం రావడంతో బాలానగర్ ఎస్ఓటి సిబ్బంది మరియు జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆ లారీలను పట్టుకున్నారని ఆయన తెలిపారు. అయితే దీనిలో మనం గమనించినట్లయితే గాంజా అనే అనుమానం రాకుండా గంజా ను కింద ప్యాకెట్ లో ఉంచి నర్సరీ మొక్కలను పెట్టి వాటిని తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే మన ఎస్.ఓ.టి సిబ్బంది చాకచక్యంగావారిని పట్టుకోవడం జరిగింది. మరి ఈ ఆపరేషన్ ను సమర్థవంతంగా నిర్వహించి పట్టుకున్నటువంటి ఎస్ఓటి సిబ్బంది మరియు జీడిమెట్ల లాండ్ ఆర్డర్ పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు కమీషనర్.