Hyderabad : హైదరాబాదులో అద్దె ఇంటి కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారా…అయితే ఇది మీకోసమే…

Hyderabad : హైదరాబాద్ మహానగరంలో ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ఉద్యోగాలు తదితర పనులు చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన వారికి అద్దె ఇల్లు వెతుక్కోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. వారంతట వారు వెతుక్కునే పరిస్థితుల్లో లేకపోతే ఏదైనా ఆన్లైన్లో రిక్వెస్ట్ పెట్టడం వలన లేదా ఆన్లైన్లో బ్రోకరేజ్ కంపెనీస్ ను కలిసి వారికి కావాల్సినవి చెప్పుకోవడంతో వాటిని చూసి పెడతారు. ఇలాంటి బ్రోకరేజ్ కంపెనీలు గచ్చిబౌలి మరియు మాదాపూర్ కార్పొరేట్ స్థాయిలలో కార్యాలయాలను ఏర్పాటు […]

  • Published On:
Hyderabad : హైదరాబాదులో అద్దె ఇంటి కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారా…అయితే ఇది మీకోసమే…

Hyderabad : హైదరాబాద్ మహానగరంలో ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ఉద్యోగాలు తదితర పనులు చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన వారికి అద్దె ఇల్లు వెతుక్కోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. వారంతట వారు వెతుక్కునే పరిస్థితుల్లో లేకపోతే ఏదైనా ఆన్లైన్లో రిక్వెస్ట్ పెట్టడం వలన లేదా ఆన్లైన్లో బ్రోకరేజ్ కంపెనీస్ ను కలిసి వారికి కావాల్సినవి చెప్పుకోవడంతో వాటిని చూసి పెడతారు. ఇలాంటి బ్రోకరేజ్ కంపెనీలు గచ్చిబౌలి మరియు మాదాపూర్ కార్పొరేట్ స్థాయిలలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని కోట్లలో బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇంటర్నెట్ లో వెతికితే హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే బ్రోకర్ కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే అలాంటి కంపెనీలలో మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉండడంతో ఆయా కంపెనీల రేటింగ్లను బట్టి పాత కస్టమర్ల రివ్యూ ని బట్టి కంపెనీలను చూసుకోవడం మంచిది.

House Rent Images - Free Download on Freepik

 

ముందస్తు ఒప్పందం ……

ముఖ్యంగా పశ్చిమ హైదరాబాదులో పెద్ద ప్రాజెక్టుల వద్దకు బ్రోకరేజ్ కంపెనీలు వెళ్లి ఓనర్లు మరియు బిల్డర్ లతో ముందస్తు ఒప్పందం చేసుకుంటున్నారు. అయితే ఈ ఒప్పందం అనేది లికితక పూర్వకంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ , వారికి వారికి మధ్య కో ఆర్డినేషన్ అయితే ఉంటుంది. దీంతో ఈ ఏజెన్సీ వారు వారి కస్టమర్లను తీసుకువచ్చి ఖాళీగా ఉన్న ఫ్లాట్లను లేదా ఇళ్ళను చూపిస్తుంటారు. కొన్ని ఏజెన్సీలు పదుల సంఖ్యలో తమ ఉద్యోగులను నియమించుకుని వారి యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.

రెంటు రియల్ ఎస్టేట్ రంగం…..

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రెంటల్ కంపెనీలు కేవలం రెంటు పర్పస్ కోసం మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తున్నారు. చిన్నచిన్న వెంచర్ల దగ్గర నుండి అపార్ట్మెంట్ లను సొంతం చేసుకుని లీజ్ కు ఇవ్వడం వంటివి కూడా చేస్తున్నారు. అయితే దూరప్రాంతాల నుండి వచ్చి అద్దెకు ఇల్లు కావాలి అనుకునేవారు వీరిని సంప్రదిస్తే గంటల వ్యవధిలోనె వీరి నుండి సమాచారం మీకు లభిస్తుంది. అయితే ఇలా ఫ్లాట్ అద్దెకు ఇప్పించడం ద్వారా వారు తీసుకునే ఫీజు అనేది ఆ ఇంటి రెంటు పై ఆధారపడి ఉంటుంది.