Health tips : పడుకునే ముందు ఇలాంటి ఆహారం తీసుకుంటున్నారా..అయితే ఇక మీ పని అంతే..

Health tips :  మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు లో కనీసం ఏడు గంటల పాటు నిద్రపోవడం చాలా ముఖ్యం. కంటికి సరిపడా నిద్ర లేకపోతే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ,ఉండలేము. ఈ నిద్రలేమి సమస్య అనేది ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం రాత్రి నిద్ర పట్టకపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. దానిలో ప్రధానమైనది మొబైల్ వాడకం అని తెలుస్తుంది. అలాగే పడుకునే ముందు టీ కాఫీ లాంటివి తీసుకోవడం […]

  • Published On:
Health tips : పడుకునే ముందు ఇలాంటి ఆహారం తీసుకుంటున్నారా..అయితే ఇక మీ పని అంతే..

Health tips :  మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు లో కనీసం ఏడు గంటల పాటు నిద్రపోవడం చాలా ముఖ్యం. కంటికి సరిపడా నిద్ర లేకపోతే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ,ఉండలేము. ఈ నిద్రలేమి సమస్య అనేది ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం రాత్రి నిద్ర పట్టకపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. దానిలో ప్రధానమైనది మొబైల్ వాడకం అని తెలుస్తుంది. అలాగే పడుకునే ముందు టీ కాఫీ లాంటివి తీసుకోవడం వల్ల కూడా నిద్ర పట్టదు. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వలన రాత్రులు ప్రశాంతంగా ,నిద్రపోలేమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వెన్న.. చీజ్..

రాత్రి పడుకునే ముందు వెన్నె చీజ్ లాంటి ఆహారాలు తినకూడదు. రాత్రివేళ ఇలాంటివి తినడం వలన నిద్రలో ఆటంకాలు ఏర్పడతాయట. వెన్నె కలిగిన ఆహారాన్ని పగటిపూట మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో ఉండే ఆక్సలైక్ యాసిడ్ నిద్రకు భంగం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

టమాట..

రాత్రివేళ టమాటలను తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. టమాటాల లో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఆక్సలిక్ ఆమ్లం అంటారు. దీని వలన ఎస్డిటి సమస్య ఏర్పడుతుంది. కావున రాత్రిపూట టమాటాలు తినకుండా ఉండటం మంచిది .

కాఫీ ..టీ..

చాలామంది కి రాత్రి పడుకునే ముందు కాఫీ గాని టీ గాని తాగడం అలవాటు. అయితే టీ కాఫీ మన నిద్రను పోగొట్టి నిద్ర రాకుండా చేస్తుంది. కావున పడుకునే ముందు కాఫీ తాగడం మానేస్తే మంచిది.

క్రీమ్ఐస్ ..

రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలనుకునేవారు ఐస్ క్రీమ్ కి దూరంగా ఉండాలి. ఐస్ క్రీమ్ తినడం వలన కార్టసాల్ హార్మోన్ పెరుగుతుంది. దీనివలన ప్రశాంతమైన నిద్ర దొరకడం కష్టం.

ఫ్రై చేసిన ఆహారం..

రాత్రిపూట వేయించిన పదార్థాలను తినడం వలన జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనివలన ఆహారం అరగడానికి నిద్రకు భంగం కలుగుతుంది.

ఫిజ్జా…

ఈరోజుల్లో చాలామంది ఫిజ్జా తినడం అలవాటు చేసుకున్నారు. అయితే పిజ్జా లో వెన్న టమాటా ఉంటాయి. అలాగే దీనిలో ఆకలిక్ యాసిడ్ ఉండడం వలన నిద్రలేని రాత్రులకు దారి తీస్తుంది.