BREAKING : పరిటాల రవి జీవిత కథే ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా !

BREAKING : సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా. నటసింహం బాలయ్య నటించిన ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా 130 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలయ్య గత సినిమా అఖండ సినిమా కంటే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో భారీ ఫైట్లు, మాస్ డైలాగులతో […]

  • Published On:
BREAKING : పరిటాల రవి జీవిత కథే ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా !

BREAKING : సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా. నటసింహం బాలయ్య నటించిన ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా 130 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలయ్య గత సినిమా అఖండ సినిమా కంటే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో భారీ ఫైట్లు, మాస్ డైలాగులతో బాలయ్య ఇరగ తీసేసాడు. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటిటి లోకి రానుందని సమాచారం. దీనిపై ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు.

అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని వెల్లడించారు. ‘వీరసింహారెడ్డి’ సినిమా కథ, హీరో పాత్రను రాసుకున్న విధానం, దీనికి స్ఫూర్తి ఎవరనేది ఆయన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. మాజీ టిడిపి నేత పరిటాల రవిని దృష్టిలో ఉంచుకొని ఈ కథ రాశానని చెప్పారు. హీరో పాత్ర రాసేటప్పుడు నా ఊహలో పరిటాల రవి ఉన్నారని చెప్పారు. సినిమా కోసం ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలను స్ఫూర్తిగా తీసుకున్నానని గోపీచంద్ తెలిపారు.

అప్పట్లో పరిటాల రవికి ప్రమాదం ఉందని ఓ పేపర్లో చదివాను. కొందరు ఆయనను యూఎస్ రమ్మని అన్నారు అయితే తాను పుట్టింది ఇక్కడే, చనిపోయిన కూడా ఇక్కడే అని అందుకే ఆయన వద్దన్నారు అని ఆ పేపర్లో ఉంది అని చెప్పుకొచ్చారు గోపీచంద్ మలినేని. పరిటాల జీవితంలోని కొన్ని ఘటనల స్ఫూర్తితో ‘వీరసింహారెడ్డి’ పాత్రతో పాటు ఆ సినిమా ఇంటర్వెల్ బ్లాక్‌ను డిజైన్ చేసుకున్నానని గోపీచంద్ తెలిపారు. ఏదేమైనా ఈ సినిమా స్టోరీ పరంగా సూపర్ హిట్ అయింది. స్టోరీ కి తగ్గట్టే బాలయ్య పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు.

Must Read : Dhee 15 Championship : ” యాంకర్ ప్రదీప్ అంటే ఇష్టం అతడినే పెళ్లి చేసుకుంటా ” స్టేజ్ పైనే ప్రపోజ్ చేసిన శ్రద్ధదాస్ ..