Balakrishna : విగ్గు ప్రస్తావనపై బాలయ్య కామెంట్స్ వైరల్…నీ అడ్డం వెంట్రుకలు ఎక్కడ తెచ్చి పెట్టుకున్నావు…

Balakrishna : తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య బాబుకు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు బాలయ్య ను ఆరాధిస్తారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య అనే శ్లోగం ఎంత ఫేమస్ నో చెపాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే బాలయ్య కూడా బాక్సాఫీస్ వద్ద వరుసగా ఘన విజయాలను అందుకుంటూ సీనియర్ హీరోగా దూసుకెళ్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోల ఎవరికీ సాధ్యం కానీ విధంగా బాలయ్య […]

  • Published On:
Balakrishna  : విగ్గు ప్రస్తావనపై బాలయ్య కామెంట్స్ వైరల్…నీ అడ్డం వెంట్రుకలు ఎక్కడ తెచ్చి పెట్టుకున్నావు…

Balakrishna : తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య బాబుకు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు బాలయ్య ను ఆరాధిస్తారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య అనే శ్లోగం ఎంత ఫేమస్ నో చెపాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే బాలయ్య కూడా బాక్సాఫీస్ వద్ద వరుసగా ఘన విజయాలను అందుకుంటూ సీనియర్ హీరోగా దూసుకెళ్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోల ఎవరికీ సాధ్యం కానీ విధంగా బాలయ్య సక్సెస్ సాగుతుంది. కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాలతో బాలయ్య రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే..

balayyas-comments-on-the-mention-of-wig-went-viral

ఇక ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల చేయనున్నారు.ఈ క్రమంలోనే సినీ బృందం సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల బాలయ్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాట్లాడుతున్న సందర్భంలో విగ్గు ప్రస్తావన రాగా..ఒకప్పుడు జరిగిన ఓ సంఘటనను ప్రేక్షకులతో పంచుకున్నారు. తాను షూటింగ్ టైంలో ఉన్నప్పుడు గ్యాప్ దొరికితే చాప వేసుకుని కింద పడుకుంటానని…అదేవిధంగా విగ్గు తీసి పక్కన పెడతానని , కానీ ఒక రోజు ఒకడు నన్ను మీరు విగ్గు వాడతారా అని అడిగాడు. దానికి నేను నీ గడ్డం వెంట్రుకలు ఎక్కడ నుంచి తీసుకొని పెట్టుకున్నావు అంటూ సమాధానమిచ్చానని బాలయ్య చెప్పారు.

balayyas-comments-on-the-mention-of-wig-went-viral

మన దంతా ఓపెన్ బుక్. ఎవడికి భయపడేది లేదు అంటూ , బాలయ్య కామెంట్ చేశారు. దీంతో బాలయ్య మాటలకు ఒకసారి అందరు నవ్వుకున్నారు. ఇక అభిమానులైతే బాలయ్య లోపల ఏమి పెట్టుకోడని ఏదైనా సరే ఫెస్ టూ ఫేస్ మాట్లాడుతాడు అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కూడా భారీ హిట్ ను సొంతం చేసుకుంటే బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.