Venu Swamy : ఎన్టీఆర్ జాతకంలో దోషం…భయపెడుతున్న వేణు స్వామి జాతకం…
Venu Swamy : తెలుగు సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల జాతకాలను మరియు జ్యోతిష్యాన్ని చెబుతూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు వేణు స్వామి. అయితే వేణు స్వామి చెప్పే జాతకాన్ని సెలబ్రిటీలలో కూడా చాలామంది నమ్ముతారు. అంతేకాక కొన్ని సందర్భాలలో వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు కూడా నిజమయ్యాయి. దీంతో చాలామంది వేణు స్వామి జాతకాన్ని విశ్వసిస్తారు. అయితే ఒకప్పుడు వేణు స్వామి అంటే మామూలు జ్యోతిష్యుడు కావచ్చు కానీ ఇప్పుడు సినీ సెలబ్రిటీల మరియు రాజకీయ […]
Venu Swamy : తెలుగు సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల జాతకాలను మరియు జ్యోతిష్యాన్ని చెబుతూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు వేణు స్వామి. అయితే వేణు స్వామి చెప్పే జాతకాన్ని సెలబ్రిటీలలో కూడా చాలామంది నమ్ముతారు. అంతేకాక కొన్ని సందర్భాలలో వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు కూడా నిజమయ్యాయి. దీంతో చాలామంది వేణు స్వామి జాతకాన్ని విశ్వసిస్తారు. అయితే ఒకప్పుడు వేణు స్వామి అంటే మామూలు జ్యోతిష్యుడు కావచ్చు కానీ ఇప్పుడు సినీ సెలబ్రిటీల మరియు రాజకీయ నాయకుల పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ,సంచలన విషయాలను బయటపెడుతూ స్టార్ జ్యోతిష్యుడుగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పటికే ఎంతోమంది జాతకాలను చెప్పిన వేణు స్వామి తాజాగా ఓ స్టార్ హీరో జాతకంలోని దోషాల గురించి వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే
అయితే వేణు స్వామి గతంలో నాగచైతన్య మరియు సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వారిద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండరని కామెంట్స్ చేశారు. ఇక వేణు స్వామి చెప్పినట్లుగానే వీరిద్దరూ కొన్నేళ్లకే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఆ సమయంలో వేణు స్వామి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే అప్పటినుండి సినీ సెలబ్రిటీల జాతకాల గురించి వేణు స్వామి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ గురించి పలుసార్లు ప్రస్తావించిన వేణు స్వామి తాజాగా ఎన్టీఆర్ తల్లిని కలిశానని ఆయన జాతకంలో ఉన్న దోషాల గురించి చర్చించానని చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే వేణు స్వామి ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లినప్పుడు ఎన్టీఆర్ తల్లిని కలవడం జరిగిందట. ఇక ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ సమయంలో తారక్ జాతకం గురించి ఎన్టీఆర్ తల్లి శాలిని అడిగి తెలుసుకున్నట్లుగా తెలియజేశాడు.
అలాగే తారక్ జాతకంలో తాను గమనించిన పలు విషయాలను ఆమెతో పంచుకున్నట్లుగా తెలియజేశాడు. అయితే ఆ సమయంలో తారక్ జాతకం పూర్తిగా తెలియకుండా బాగుందని ఎలా చెబుతారు అంటూ ఆమె ప్రశ్నించిందట. ఆ సమయంలో ఎన్టీఆర్ జాతకం గురించి తనకు అన్నీ తెలుసని ఆఖరికి ఆయన జాతకంలో ఉన్న దోషం గురించి కూడా తెలుసు అని వేణు స్వామి శాలినీకి తెలియజేశారట. ఇక ఆ విషయం చెప్పగానే ఎన్టీఆర్ కు ఉన్న దోషం గురించి తనకు ఎన్టీఆర్ కు తప్ప ఎవరికీ తెలియదని శాలిని ఆశ్చర్యపోయినట్లుగా వేణు స్వామి తెలియజేశారు. అయితే ఎన్టీఆర్ మరియు జయలలిత జాతకాలు దాదాపు ఒకే మాదిరిగా ఉంటాయని ముందు రోజుల్లో ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో రాణించే అవకాశాలు ఉన్నట్లుగా వేణు స్వామి తెలియజేశారు. ఈ క్రమంలోనే 2030 కల్లా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మంచిదని శాలినికి వేణు స్వామి సలహా ఇచ్చినట్లుగా బయటపెట్టారు. అయితే తారక్ జాతకంలో ఉన్న దోషం గురించి మాత్రం వేణు స్వామి పూర్తిగా తెలియజేయలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.