MEGA FAMILY : మెగా ఇంట్లో సంక్రాంతి సంబరాలు… ఉమ్మడి కుటుంబం.. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు….

MEGA FAMILY : తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఉన్న ఆదరణ అంతా అంతా కాదు. ఇక చిరంజీవి ఇంట్లో శుభకార్యమైన పండుగలైన చాలా ఘనంగా జరుపుకుంటారు. అందరూ ఒక చోట చేరి పండుగలను జరుపుకునే తీరు చూస్తే తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం చిరంజీవి ఇంటి వైపు చూడాల్సిందే. అంతలా వీరు పండుగలను జరుపుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి సంబరాలు కూడా చిరంజీవి ఇంట్లో అంబరాన్ని అంటాయని చెప్పాలి. అలాగే తాజాగా […]

  • Published On:
MEGA FAMILY : మెగా ఇంట్లో సంక్రాంతి సంబరాలు… ఉమ్మడి కుటుంబం.. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు….

MEGA FAMILY : తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఉన్న ఆదరణ అంతా అంతా కాదు. ఇక చిరంజీవి ఇంట్లో శుభకార్యమైన పండుగలైన చాలా ఘనంగా జరుపుకుంటారు. అందరూ ఒక చోట చేరి పండుగలను జరుపుకునే తీరు చూస్తే తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం చిరంజీవి ఇంటి వైపు చూడాల్సిందే. అంతలా వీరు పండుగలను జరుపుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి సంబరాలు కూడా చిరంజీవి ఇంట్లో అంబరాన్ని అంటాయని చెప్పాలి. అలాగే తాజాగా వరుణ్ తేజ్ లావణ్య వివాహాలతో సంక్రాంతి పండుగ మెగా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకంగా నిలిచిందని చెప్పాలి. అంతేకాక చిరంజీవి ఇంట్లోకి మనవరాలు కూడా అడుగుపెట్టడంతో మరింత వైభవంగా జరిగింది.

ఈ క్రమంలోనే సంక్రాంతి వేడుకలకు మెగా ఫ్యామిలీ అంతా బెంగళూరులోని ఫామ్ హౌస్ కి చేరుకొని అంగరంగ వైభవంగా పండుగను జరుపుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ వేళ మెగా ఫ్యామిలీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా వారంతా కలిసి దిగిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. ఇక ఈ సంక్రాంతి పండుగకు మెగా కుటుంబంతో పాటు ఇక ఈ సంక్రాంతి అల్లు కుటుంబం కూడా పాల్గొన్నారు. అదేవిధంగా సాయి ధరమ్ తేజ్ వైష్ణవి తేజ్ కూడా పాల్గొన్నారు. ఈ ఒక్క ఫోటోలు మెగా ఫ్యామిలీ హీరోలందరూదరూ కనిపించడం చాలా స్పెషల్ గా అనిపించింది. ఒక పవన్ కళ్యాణ్ మినహాయించి అందరూ ఈ పండుగలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అందరూ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ఈ ఫోటో చూసిన నేటిజనులు ఇది కదా అసలు పండుగ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.