Mrunal Thakur : సినిమాలోని పాత్ర కోసం వేస్తే ఇంట్లో 15 రోజులు గడిపిన మృణాల్…

Mrunal Thakur : నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. అయితే ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు అతి తక్కువ మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ నటించింది కేవలం కొన్ని తెలుగు సినిమాలు కాబట్టి. అలాగే ఈమె తెలుగు అమ్మాయి కూడా కాదు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. అయితే ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన […]

  • Published On:
Mrunal Thakur : సినిమాలోని పాత్ర కోసం వేస్తే ఇంట్లో 15 రోజులు గడిపిన మృణాల్…

Mrunal Thakur : నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. అయితే ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు అతి తక్కువ మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ నటించింది కేవలం కొన్ని తెలుగు సినిమాలు కాబట్టి. అలాగే ఈమె తెలుగు అమ్మాయి కూడా కాదు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. అయితే ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా ( 2018 )అనే సినిమాలో నటించేందుకు తన పాత్రకు 100% న్యాయం చేయాలని ఉద్దేశంతో దాదాపు 15 రోజులు పాటు వేశ్య గృహానికి వెళ్లి అక్కడే గడిపిందట. 15 రోజుల పాటు వేశ్యలతో చాలా దగ్గరగా ఉంటూ తన సినిమాలోని పాత్రకు న్యాయం చేసింది. అయితే మృణాలు ఇంత చేసినప్పటికీ ఆ సినిమా ఆమెకు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.

unknow-facts-about-mrunal-thakur

అంతేకాక ఈ ముద్దుగుమ్మ దాదాపు బాలీవుడ్ సినిమాలు 7 దాకా చేసిందట. కానీ అవేమీ కూడా ఆమెకు మంచి క్రిజ్ తెచ్చి పెట్టలేదు. ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటిగా సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఊహించని విధంగా తన మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు సౌత్ సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ లభించింది. దీంతో ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలను చేస్తూ స్టార్ హీరోయిన్ల జాబితాలో దూసుకెళ్తోంది. అయితే మృనాల్ మొదట సినిమాల కంటే కూడా సీరియల్స్ లోనే ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంది. మరి ముఖ్యంగా కుంకుమ భాగ్య అనే సీరియల్ తో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సీరియల్ చేసే సమయంలోనే సినీ అవకాశాలు రావడంతో బుల్లితెరకు గుడ్ బయ్ చెప్పి వెండితెరకు పరిమితమైంది.

unknow-facts-about-mrunal-thakur

ఇక ఆమె తండ్రి విషయానికొస్తే యూనియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అని సమాచారం. మృనాల్ తల్లి గృహిణి . అలాగే ఈమెకు ఒక అక్క తమ్ముడు కూడా ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తన నటించిన మొదటి సినిమాకు 80 లక్షల రెమ్యూనికేషన్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 3 నుండి 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ కాలేజీ సమయంలోనే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో బుల్లితెర సీరియల్స్ లో అవకాశాలను దక్కించుకుని ఫుల్ టైం యాక్టింగ్ కొనసాగించాలని ఉద్దేశంతో చదువును కూడా మధ్యలోనే మానేసింది. యాక్టింగ్ కోసం అన్ని వదిలేసి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమా లో నటించనుంది. అదేవిధంగా ఇటీవల నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో కూడా నటించి మెప్పించింది.