Balayya : బాలయ్య నిజంగా దేవుడు రా .. తారకరత్న ఆరోగ్య విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్న బాలయ్య ..!!

Balayya : నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆసుపత్రి పాలై రెండు వారాలు దాటింది. ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. తారకరత్న త్వరగా కోలుకునేందుకు విదేశాల నుంచి వైద్యులను రప్పిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తారకరత్న ఆరోగ్య విషయంలో బాలకృష్ణ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. తారకరత్న ఆసుపత్రి పాలైన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా అక్కడే ఉండి వైద్యం కోసం అవసరమైన ఏర్పాట్లు అన్ని దగ్గరుండి చూస్తున్నారు. ఇక ఇటీవల తారకరత్న ఆరోగ్యం మెరుగవాలని అఖండ […]

  • Published On:
Balayya : బాలయ్య నిజంగా దేవుడు రా .. తారకరత్న ఆరోగ్య విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్న బాలయ్య ..!!

Balayya : నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆసుపత్రి పాలై రెండు వారాలు దాటింది. ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. తారకరత్న త్వరగా కోలుకునేందుకు విదేశాల నుంచి వైద్యులను రప్పిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తారకరత్న ఆరోగ్య విషయంలో బాలకృష్ణ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. తారకరత్న ఆసుపత్రి పాలైన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా అక్కడే ఉండి వైద్యం కోసం అవసరమైన ఏర్పాట్లు అన్ని దగ్గరుండి చూస్తున్నారు.

ఇక ఇటీవల తారకరత్న ఆరోగ్యం మెరుగవాలని అఖండ దీపారాధనకి శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బత్తలూరు గ్రామంలో మృత్యాంజనేయ స్వామి గుడిలో దాదాపుగా 44 రోజులపాటు అఖండ జ్యోతి వెలిగేల చర్యలు తీసుకుంటున్నారు. అయితే తన సొంత కొడుకులా చూసుకుంటున్న బాలయ్య తారకరత్న ఆరోగ్య విషయలో మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ ఎన్బికె 108 ‘ సినిమాలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఫిబ్రవరి మొదటి వారంలో సెకండ్ షెడ్యూల్ కు ప్లాన్ చేశారు.

అయితే ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కానుందట. తారకరత్న ఆరోగ్యం గురించి దగ్గరుండి చూసుకుంటున్న బాలయ్య ఈ సినిమా షూటింగ్ కి పాల్గొనలేనని సినిమా యూనిట్ కు చెప్పేసారట. తన సినిమా సెకండ్ షెడ్యూల్ వాయిదా వేయమని రిక్వెస్ట్ చేశారట. తారకరత్న ఆసుపత్రిలో ఉండడంతో మానసిక పరిస్థితి ఏమి బాగోలేదని ఇలాంటి టైంలో షూటింగ్ కి హాజరు కాలేనని తెలిపారట. తారకరత్న పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్ కి వస్తానని చెప్పారట. ఇకపోతే బాలయ్య సంక్రాంతి కానుకగా ‘ వీరసింహారెడ్డి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు.

Must Read : BREAKING : దేశంలో ఆ 225 నగరాల్లో ‘ జొమాటో ‘ సేవలు బంద్ !