Tollywood : తెలుగు హీరోలను వాడేసుకుంటున్న బాలీవుడ్ సెలబ్రిటీలు…అప్పుడు చరణ్ ఇప్పుడు తారక్…

Tollywood : అవును ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది స్టార్ సెలబ్రిటీస్ వాడుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఇప్పుడు అదే లిస్టులోకి మరో హీరో పేరు వినిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ పేర్లను పలువురు సిని సెలబ్రిటీలు ఎంతలా వాడుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. […]

  • Published On:
Tollywood : తెలుగు హీరోలను వాడేసుకుంటున్న బాలీవుడ్ సెలబ్రిటీలు…అప్పుడు చరణ్ ఇప్పుడు తారక్…

Tollywood : అవును ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది స్టార్ సెలబ్రిటీస్ వాడుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఇప్పుడు అదే లిస్టులోకి మరో హీరో పేరు వినిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ పేర్లను పలువురు సిని సెలబ్రిటీలు ఎంతలా వాడుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ రామ్ చరణ్ పేరును చెప్పుకొని స్పెషల్ ఎట్రాక్షన్ కోసం ట్రై చేస్తున్నారు.

bollywood-celebrities-who-keep-using-telugu-heroes-then-charan-now-tarak

ఈ నేపథ్యంలోనే వారి సినిమాలు రిలీజ్ అయ్యే ముందు మా సినిమాలో చరణ్ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారంటూ ప్రచారం చేసి సినిమాకు మంచి హైప్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమాకు మరియు రాంచరణ్ నటించిన ధ్రువ సినిమాకి కనెక్షన్ ఉందని కూడా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత చూస్తే ఆ సినిమా పూర్తి డిజాస్టర్ అయింది. అలాగే ఇటీవల లోకేష్ కనకరాజు గారికి ఇచ్చిన లియో సినిమాలో కూడా చరణ్ ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అవి అయితే వాస్తవాలు కాలేదు.

bollywood-celebrities-who-keep-using-telugu-heroes-then-charan-now-tarak

అయితే ఇప్పుడు అదే ప్రయత్నం బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా చేస్తుంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న టైగర్ 3 అనే సినిమా ఈ ఆదివారం విడుదలకు సిద్ధంగా ఉంది. యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో పాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ను వాడుకోవడానికి టైగర్ త్రీ మూవీ టీం ఇలా చేసిందంటూ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. మరికొందరు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ మరియు తారక్ ను ఇండస్ట్రీ వాళ్ళు బాగా వాడేసుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.