Balakrishna : జూ. ఎన్టీఆర్ ని మా ఫ్యామిలీ నుండి తీసేసాం .. బాలయ్య సంచలన వ్యాఖ్యలు ..

Balakrishna : తెలుగు రాష్ట్రాలలో నందమూరి కుటుంబానికి ఎటువంటి గౌరవం ఉందో అందరికీ తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ తో మొదలైన ఆ ప్రస్థానం ఇప్పటికే ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ లాగానే ఆయన కొడుకు బాలకృష్ణ సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబును ఓ […]

  • Published On:
Balakrishna : జూ. ఎన్టీఆర్ ని మా ఫ్యామిలీ నుండి తీసేసాం .. బాలయ్య సంచలన వ్యాఖ్యలు ..

Balakrishna : తెలుగు రాష్ట్రాలలో నందమూరి కుటుంబానికి ఎటువంటి గౌరవం ఉందో అందరికీ తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ తో మొదలైన ఆ ప్రస్థానం ఇప్పటికే ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ లాగానే ఆయన కొడుకు బాలకృష్ణ సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబును ఓ కేసుపై అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో ఏపీ ప్రభుత్వంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

we-removed-ntr-from-our-family-balayyas-sensational-comments

కేవలం ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా చంద్రబాబును అరెస్టు నుంచి విడిపించాలని పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అయితే తాజాగా బాలకృష్ణ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణలో ఎన్నికలు మొదలయ్యాయని, అక్కడ తన తండ్రి పేరును జపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కూడా టిడిపి జెండాను ఎగురవేస్తాం. ఏపీలో సైకో పరిపాలన నడుస్తుంది. ప్రజా సంక్షేమం వదిలి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టే రాజకీయం అక్కడ జరుగుతుంది అని అన్నారు. బాలకృష్ణ ఇంకా మాట్లాడుతూ 17వ సెక్షన్ పాటించకుండా చంద్రబాబును అరెస్టు చేశారు.

ఈ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదు. అనవసరంగా ఎవరిపైన నిందలు వేయం. భాజపా అధ్యక్షురాలుగా మా అక్క పురందేశ్వరి ఉన్నారు. ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడుతాం. ఇకపోతే చంద్రబాబు అరెస్టుపై సినిమా వాళ్ళు పట్టించుకోకపోవడం నాకు అనవసరం ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అని అన్నారు. మనకు తెలిసిందే చంద్రబాబు అరెస్ట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు స్పందించలేదు. దీంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ నడుస్తుంది. చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ స్పందించకపోవడాన్ని వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా నడుస్తుంది.