Fridge : ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్లో పెడితే ఇక అంతే…తస్మాత్ జాగ్రత్త…

Fridge : ప్రస్తుత కాలంలో రిఫ్రిజిరేటర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పల్లెటూరు పట్నాలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫ్రిజ్ ను వినియోగిస్తున్నారు. ఇక ఇంట్లో వండిన ఆహార పదార్థాలు పాడవకుండా , అలాగే కూరగాయలు మరియు ఇతర పదార్థాలు ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉండేందుకు ఈ రిఫ్రిజిరేటర్ వినియోగిస్తున్నారు. అయితే దీనిని వాడడానికి అయితే వాడుతున్నారు కానీ వీటి వినియోగం మరియు మెయింటెనెన్స్ పట్ల ప్రజలకు అవగాహన మాత్రం ఉండటం లేదు. ఏమి […]

  • Published On:
Fridge : ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్లో పెడితే ఇక అంతే…తస్మాత్ జాగ్రత్త…

Fridge : ప్రస్తుత కాలంలో రిఫ్రిజిరేటర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పల్లెటూరు పట్నాలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫ్రిజ్ ను వినియోగిస్తున్నారు. ఇక ఇంట్లో వండిన ఆహార పదార్థాలు పాడవకుండా , అలాగే కూరగాయలు మరియు ఇతర పదార్థాలు ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉండేందుకు ఈ రిఫ్రిజిరేటర్ వినియోగిస్తున్నారు. అయితే దీనిని వాడడానికి అయితే వాడుతున్నారు కానీ వీటి వినియోగం మరియు మెయింటెనెన్స్ పట్ల ప్రజలకు అవగాహన మాత్రం ఉండటం లేదు. ఏమి పడితే అవి ఫ్రిజ్లో పెడుతుంటారు. కానీ ఎలాంటి ఆహారాలు పెట్టాలి..?ఎలాంటివి పెట్టకూడదు…?అనేది చాలామందికి తెలియదు. అయితే మరి ముఖ్యంగా నాలుగు రకాల ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి అదేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఉల్లిపాయ…

if-you-put-these-food-items-in-the-fridge-thats-it

ఉల్లిగడ్డలను ఫ్రిజ్ లో ఎట్టి పరిస్థితుల లోను పెట్టకూడదు. ఒకవేళ ఫ్రిడ్జ్ లో దీనిని స్టోర్ చేసినట్లయితే ఉల్లిపాయలో ఉండే పిండి పదార్థం చక్కగా మారుతుంది. తద్వారా వాటికి త్వరగా బూజు పట్టే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది ఉల్లిపాయలు సగం కోసి మరో సగం వంటలో వినియోగిస్తుంటారు. మిగిలిన సగభాగాన్ని ఫ్రిజ్లో ఉంచుతారు. ఇలా ఉంచడం వలన అనారోగ్యమైన బ్యాక్టీరియాని ఆకర్షించి ఆరోగ్య సమస్యలు వచ్చేలా చేస్తాయి.

వెల్లుల్లి…

if-you-put-these-food-items-in-the-fridge-thats-it

అయితే ముందుగా అసలు వలిచిన వెల్లుల్లి కొనుగోలు చేయకూడదు. అదేవిధంగా వాటిని ఫ్రిజ్లో కూడా నిల్వ చేయకూడదు. అదేవిధంగా వలచిన వెల్లుల్లి ఫ్రిజ్ లో ఉంచడం వలన బూజు ,మచ్చలు త్వరగా ఏర్పడి చెడిపోతాయి. ఇది క్యాన్సర్ వంటి భయంకర రోగాలకు దారి తీస్తుంది. అందుకే వెల్లుల్లిని గడ్డలుగా కొనుగోలు చేసి వంటగదిలోనే నిల్వ చేసుకోవాలి.

అన్నం…

if-you-put-these-food-items-in-the-fridge-thats-it

మన పెద్దలు ప్రకారం చూస్తే పెద్దన్నం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంటారు. అయితే ఈ రోజుల్లో మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టి తర్వాత రోజు తింటున్నారు. అయితే స్టార్ట్ రెసిస్టెన్స్ కారణంగా ఇది కొలెస్ట్రాల్ మరియు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని అంటున్నారు. అయితే త్వరగా చెడిపోయే లక్షణాలున్న అన్నాన్ని ఫ్రెష్ గానే తినాలి. ఒకవేళ దీనిని రిఫ్రిజిరేటర్ లో పెట్టాలనుకుంటే 24 గంటలకు మించి ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు.

అల్లం…

if-you-put-these-food-items-in-the-fridge-thats-it

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో రోగ నిరోధక శక్తి ని పెంచే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీనిని వంటల్లో మరియు టీ ,ల్తయారీలో విరివిగా ఉపయోగిస్తుంటారు. మరి ముఖ్యంగా చలికాలంలో జలుబు వంటి సమస్యలకు అల్లంటి చక్కటి పరిష్కారం. అయితే అల్లం ఫ్రిజ్ లో ఎక్కువగా ఉంచడం వలన త్వరగా బుజ్ పడుతుంది. అలాగే ఫ్రిజ్ లో ఉంచి దీనిని వాడడం వలన మూత్రపిండాలు ,కాలేయ వైపల్యం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అల్లంను ఫ్రిజ్ లో ఉంచడం కంటే బయట ఉంచడం మంచిదని సూచిస్తున్నారు.