Afternoon Sleep : మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రపోతున్నారా…?అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి…

Afternoon Sleep  : ప్రస్తుత కాలంలో చాలామంది మధ్యాహ్నం భోజనం తీసుకున్న తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అలా కాసేపటికి నిద్రపోతూ ఉంటారు. అంతేకాక మధ్యాహ్నం భోజనం తీసుకున్న తర్వాత చాలామందికి విపరీతమైన నిద్ర వస్తుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మధ్యాహ్న భోజనం తీసుకున్న తర్వాత నిద్రపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అయితే అసలు నిద్రపోకూడదని చెప్పడం లేదు కానీ ఒక 30 నిమిషాల పాటు నిద్రపోవడం మంచిది. కానీ 30 నిమిషాల […]

  • Published On:
Afternoon Sleep : మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రపోతున్నారా…?అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి…

Afternoon Sleep  : ప్రస్తుత కాలంలో చాలామంది మధ్యాహ్నం భోజనం తీసుకున్న తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అలా కాసేపటికి నిద్రపోతూ ఉంటారు. అంతేకాక మధ్యాహ్నం భోజనం తీసుకున్న తర్వాత చాలామందికి విపరీతమైన నిద్ర వస్తుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మధ్యాహ్న భోజనం తీసుకున్న తర్వాత నిద్రపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అయితే అసలు నిద్రపోకూడదని చెప్పడం లేదు కానీ ఒక 30 నిమిషాల పాటు నిద్రపోవడం మంచిది. కానీ 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వలన హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

అందుకే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాస్త నిద్ర వచ్చినట్లుగా అనిపిస్తే ఒక 30 నిమిషాల పాటు నిద్రపోవడం మంచిది. కానీ చాలామంది గంటల తరబడి నిద్రిస్తూ ఉంటారు. ఇక దీని కారణంగా రాత్రి సమయంలో సరైన నిద్ర పట్టదు. అలాగే శరీరానికి సరైన విశ్రాంతి కూడా లభించదు. ఇది మన శరీరంపై చెడు ప్రభావాలను చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాక మధ్యాహ్నం ప్రతిరోజు పడుకునే వారిలో అధిక బరువు పెరిగే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. అంతేకాక మధ్యాహ్నం సమయంలో అధికంగా నిద్రించే వారిలో హార్ట్ ఎటాక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మధ్యాహ్నం సమయంలో 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు పడుకోవడం మంచిది కాదని అలా పడుకోవడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే మధ్యాహ్న సమయంలో నిద్రించడం వలన కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో 30 నిమిషాల వరకు నిద్రపోయేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇక మధ్యాహ్నం అనేక రకాల పనులు చేయడం వలన మన శరీరం కాస్త అలసటగా ఉంటుంది కాబట్టి 30 నిమిషాలు నిద్ర తగినంత విశ్రాంతిని శరీరానికి అందిస్తుంది. అదేవిధంగా రాత్రి సమయంలో సరేనా నిద్రను పొందాలంటే మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రించకూడదు. కాబట్టి అందరూ రాత్రి సమయంలో కచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.