Health Tips : కోడిగుడ్డులోని పచ్చ సోన తింటే ఏమవుతుంది…?

Health Tips : సాధారణంగా ప్రతిరోజు చాలామంది గుడ్డు తింటూ ఉంటారు. ఇలా ప్రతిరోజు గుడ్డు తీసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ప్రతిరోజు గుడ్డు తినే వారికి గుడ్డులో ఉండే తెల్ల సొన తినాలా పచ్చ సోన తినాలా అనే అనుమానం వచ్చి ఉంటుంది. పచ్చ సోన తినడం వలన గుండె సంబంధిత వ్యాధులు ఏమైనా వస్తాయా అనే అపోహలు కూడా ఉన్నాయి. అయితే గుడ్డు వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో నష్టాలు ఏంటో […]

  • Published On:
Health Tips : కోడిగుడ్డులోని పచ్చ సోన తింటే ఏమవుతుంది…?

Health Tips : సాధారణంగా ప్రతిరోజు చాలామంది గుడ్డు తింటూ ఉంటారు. ఇలా ప్రతిరోజు గుడ్డు తీసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ప్రతిరోజు గుడ్డు తినే వారికి గుడ్డులో ఉండే తెల్ల సొన తినాలా పచ్చ సోన తినాలా అనే అనుమానం వచ్చి ఉంటుంది. పచ్చ సోన తినడం వలన గుండె సంబంధిత వ్యాధులు ఏమైనా వస్తాయా అనే అపోహలు కూడా ఉన్నాయి. అయితే గుడ్డు వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో నష్టాలు ఏంటో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. అయితే గుడ్డు అనేది అత్యధిక పోషక విలువలను కలిగి ఉన్న ఆహారాలలో ఒకటిగా పరిగణిస్తారు. దీనిలో శరీరానికి కావాల్సిన అన్ని పోషిక పదార్థాలు లభిస్తాయి. అందుకే ఎదుగుతున్న పిల్లలకు గుడ్డు తినిపించడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

what-happens-if-you-eat-more-eggs-a-day

ఇక గుడ్డులో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. విటమిన్ బి 12 విటమిన్ సి వంటి పోషకాలతో పాటు అనేక యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తుంది. అయితే గుడ్డు వలన ఎన్ని లాభాలు అయితే ఉన్నాయో దానిని అమితంగా తినడం వలన అంతే నష్టాలు ఉన్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక్కరోజులో ఎక్కువ గుడ్లు తినడం వలన ఉదర సంబంధిత వ్యాధులు మరియు శరీరంలో చెడు కొలెస్ట్రాలు స్థాయిలు పెరుగుతాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే గుడ్డులో ఉండే సొనలో కొలెస్ట్రాల్ శాతం అధికంగా ఉంటుంది. ఇక ఒక్క గుడ్డులో దాదాపు 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది.

what-happens-if-you-eat-more-eggs-a-day

అయితే తాజాగా నిర్ధారించిన ఓ అధ్యయనం ప్రకారం శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కంటే ఆహార పదార్థాల వలన తీసుకునే కొలెస్ట్రాల్ తక్కువ ప్రభావం చూపిస్తుందట. కావున ఒకరోజులో ఎన్ని గుడ్లు తిన్నా ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పొచ్చు. అయితే ఇది వ్యక్తి యొక్క ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైన వ్యక్తి సగటున వారానికి ఏడు గుడ్లు ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనట్లయితే రోజు లో మూడు గుడ్ల వరకు తీసుకోవచ్చట. కాకపోతే వేసవి కాలంలో గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో వేడి పెరుగుతుంది. తద్వారా ఇది అతిసారానికి కూడా దారి తీస్తుంది. కావున వేసవిలో గుడ్డు తక్కువగా తీసుకోవడం మంచిది.