Heel Pain : మడవ నొప్పి రావడానికి కారణాలు ఏంటి..?ఇంట్లోనే చికిత్స విధానం ఎలా…?

Heel Pain  : మడమ నొప్పి అనేది ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్య ఎదుర్కోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ అత్యంత ముఖ్యమైన కారణమైతే ప్లాంటర్ పాసిటివ్ అని చెప్పాలి. ఇది మడమ ఎముక మరియు కాలిమధ్య సంబంధాన్ని సృష్టిస్తుంది. అంటే పాదాల మధ్య కణజాలాల మందపాటి వాపును కలిగించే వ్యాధి. చీల మండలంలో ఇది తీవ్రమైన నొప్పిని కలిగిస్తూ ఉంటుంది.ఇక ఈ సమస్య చాలాసేపు కూర్చొని నడవడానికి లేచినప్పుడు ప్రారంభమవుతుంది. ఇక ఈ […]

  • Published On:
Heel Pain : మడవ నొప్పి రావడానికి కారణాలు ఏంటి..?ఇంట్లోనే చికిత్స విధానం ఎలా…?

Heel Pain  : మడమ నొప్పి అనేది ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్య ఎదుర్కోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ అత్యంత ముఖ్యమైన కారణమైతే ప్లాంటర్ పాసిటివ్ అని చెప్పాలి. ఇది మడమ ఎముక మరియు కాలిమధ్య సంబంధాన్ని సృష్టిస్తుంది. అంటే పాదాల మధ్య కణజాలాల మందపాటి వాపును కలిగించే వ్యాధి. చీల మండలంలో ఇది తీవ్రమైన నొప్పిని కలిగిస్తూ ఉంటుంది.ఇక ఈ సమస్య చాలాసేపు కూర్చొని నడవడానికి లేచినప్పుడు ప్రారంభమవుతుంది. ఇక ఈ సమస్య ఎక్కువగా అథ్లెటిక్స్ లలో రన్నింగ్ చేసే వారిలో కనిపిస్తూ ఉంటుంది.

what-are-the-causes-of-knee-pain-what-is-the-treatment-method-at-home

అలాగే అధిక బరువు ఉన్నవారు కాలికి సరిపడని షూ లేదా చెప్పులు ధరించడం వలన కూడా ఇలాంటి నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటివి ధరించడం వలన పాదాల దిగువ నొప్పి కి దారి తీస్తుంది. నడక సరిగా లేకపోవడం ,ఉబకాయం , నేల గట్టిగా ఉండటం, సరైన చెప్పులు వేసుకోకపోవడం వంటివి ఆర్థరైటిస్ నొప్పులకు దారితీస్తుంటాయి. ఇలాంటి నొప్పి వారం రోజులు కంటే ఎక్కువ ఉన్న నడవడానికి ఇబ్బందిగా ఉన్న వెంటనే వైద్యుని సంప్రదించాలి. అంతేకాక మడమనొప్పి నెల రోజులు కంటే ఎక్కువ ఉన్నట్లయితే సర్జరీ చేయాల్సి వస్తుంది. ఫిజియోథెరపీ చేసిన కూడా నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఆసుపత్రి వరకు వెళ్లకుండా ఇంట్లోనే ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

what-are-the-causes-of-knee-pain-what-is-the-treatment-method-at-home

ముందుగా ఈ సమస్య ఎదుర్కొన్నప్పుడు పాదానికి వీలైనంత విశ్రాంతి ఇవ్వాలి. శారీరక శ్రమ మరియు నడక కాస్త తగ్గించాలి. ఎక్కువసేపు నిలబడి ఉండకూడదు. అలాగే నొప్పి వస్తున్న చోట ప్రతిరోజు ఐస్ పెట్టడం , సున్నితంగా మసాజ్ చేయడం ,వ్యాయామాలు చేయడం వంటి పనులు చేస్తుండాలి. ఇవన్నీ పాటించిన మడమనొప్పి తగ్గకపోయినట్లయితేే వెంటనే వైద్యున్ని సంప్రదించటం మంచిది. అలాగే ఒక్క క్షణం కోసం వేడి నీళ్లలో పావు టీ స్పూన్ ఆపిల్ సైడు వెనిగర్ వేసి అందులో కాటన్ క్లాత్ ముంచి నొప్పి ఉన్నచోట కాపటం వలన కూడా ఉపశమనం పొందవచ్చు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.