Reason For Obesity : అధిక బరువుకు కారణం ఇదే…ఈ పొరపాట్లు మీరు చేయకండి……

Reason For Obesity  : మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం అవుతుంది. కానీ ప్రస్తుత కాలంలో ఉన్న బిజీ లైఫ్ వలన చాలామంది సరైన నిద్రను పొందలేకపోతున్నారు. అంతేకాక ఎప్పుడు తింటున్నారో ,ఎప్పుడు నిద్ర పోతున్నారో కూడా క్లారిటీ ఉండడం లేదు. ఇది చాలదు అన్నట్లు నిద్రపోయే ముందు మరి కొన్ని పొరపాట్లు చేస్తూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా నిద్రపోయే ముందు చేసే కొన్ని పొరపాట్ల […]

  • Published On:
Reason For Obesity : అధిక బరువుకు కారణం ఇదే…ఈ పొరపాట్లు మీరు చేయకండి……

Reason For Obesity  : మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం అవుతుంది. కానీ ప్రస్తుత కాలంలో ఉన్న బిజీ లైఫ్ వలన చాలామంది సరైన నిద్రను పొందలేకపోతున్నారు. అంతేకాక ఎప్పుడు తింటున్నారో ,ఎప్పుడు నిద్ర పోతున్నారో కూడా క్లారిటీ ఉండడం లేదు. ఇది చాలదు అన్నట్లు నిద్రపోయే ముందు మరి కొన్ని పొరపాట్లు చేస్తూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా నిద్రపోయే ముందు చేసే కొన్ని పొరపాట్ల వలన అధిక బరువు పెరుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అర్ధరాత్రి తినడం…

చాలామందికి అర్థరాత్రి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు బరువు పెరగడానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాక నిద్రించే సమయం కాబట్టి జీర్ణ వ్యవస్థ కూడా విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. దీని కారణంగా నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. అందుకే మిడ్ నైట్ తీసుకునే ఆహారాలలో చక్కెర మరియు అనారోగ్యకరమైన కొవ్వులు ఉండేవి అసలు తీసుకోకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడం మంచిది.

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్….

స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలామంది నిద్రపోయే ముందు వాటిని యూస్ చేస్తూ ఉంటారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఒక స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు టాబ్స్, లాప్టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను నిద్రపోయే ముందు వాడడం అస్సలు మంచిది కాదట. ఎందుకంటే వీటినుండి విడుదలయ్యే బ్లూ లైట్ నిద్రకుబం భంగం కలిగిస్తుంది. అంతేకాక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇక సరైన నిద్ర లేకపోవడం వలన శరీర బరువు అదుపులో ఉండదు.

వాటర్ ఎక్కువగా తాగకపోవడం…

ప్రస్తుత కాలంలో చాలామంది పని ఒత్తిడిలో పడి వాటర్ ఎక్కువగా తీసుకోలేకపోతున్నారు. ఇక ఇప్పుడు చలికాలం కావడంతో మంచినీళ్లు ఇంకా తక్కువగా తీసుకుంటున్నారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే శరీరానికి సరిపడా నీరు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. తద్వారా రాత్రివేళ ఆకలి విపరీతంగా పెరుగుతుంది. అందుకే అర్ధరాత్రి చిరుతిండ్లు తినాలనిపిస్తుంది. ఇక అర్ధరాత్రి చిరుతిండ్లు తీసుకోవడం వలన బరువు పెరుగుతారు. కావున శరీరానికి సరిపడా నీటిని తాగడం ఉత్తమం.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.