Health Care : చలికాలంలో ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకోకూడదు…ఎందుకంటే..

Health Care : చలికాలంలో కొన్ని రకాల కూరగాయలను తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని మీకు తెలుసా..?మరి ఈరోజుల్లో చలికాలంలో ఆరోగ్యని పాడుచేసే కూరగాయల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.చలికాలంలో కొన్ని రకాల కూరగాయలను తీసుకోవడం వలన గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కావున ఆరోగ్యకరమైన కూరగాయలను తీసుకోవటం చాలా ముఖ్యం. అయితే కూరగాయలలో దాదాపు అన్ని ఆరోగ్యకరమైనవి.అంతేకాక వాటిని ఎక్కువ పరిమాణంలో తీసుకున్నప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఎందుకంటే కూరగాయలలో […]

  • Published On:
Health Care : చలికాలంలో ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకోకూడదు…ఎందుకంటే..

Health Care : చలికాలంలో కొన్ని రకాల కూరగాయలను తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని మీకు తెలుసా..?మరి ఈరోజుల్లో చలికాలంలో ఆరోగ్యని పాడుచేసే కూరగాయల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.చలికాలంలో కొన్ని రకాల కూరగాయలను తీసుకోవడం వలన గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కావున ఆరోగ్యకరమైన కూరగాయలను తీసుకోవటం చాలా ముఖ్యం. అయితే కూరగాయలలో దాదాపు అన్ని ఆరోగ్యకరమైనవి.అంతేకాక వాటిని ఎక్కువ పరిమాణంలో తీసుకున్నప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఎందుకంటే కూరగాయలలో మంచి ఫైబర్ మరియు తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అయితే చలికాలంలో కొన్ని రకాల కూరగాయలను తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరి చలికాలంలో అధిక పరిమాణంలో ఏ కూరగాయలు తీసుకోకూడదు వేటికి దూరంగా ఉండాలనే అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మొక్కజొన్న అనేక రకాల ప్రయోజనాలు కలిగి ఉంటుంది.ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కానీ చలికాలంలో వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇక వీటిని మార్కెట్లో చాలా విధాలుగా తయారు చేసి అమ్ముతుంటారు. రెడీమేడ్ గా తయారు చేసిన వాటిని తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అదేవిధంగా మొక్కజొన్నలలో ఉప్పుని ఎక్కువగా కలుపుతున్నారు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.వీటి వలన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. కావున ఏదైనా సరే తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అదేవిధంగా బయట హోటల్స్ లో మాల్స్ లో వీటిని వండేటప్పుడు అనేక రకాల నూనెను వాడుతూ ఉంటారు. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి కూరగాయలు తినాలనుకున్న లేదా వండాలనుకున్న ఇంట్లోనే మంచిగా చేసుకుని తినడం మంచిది. బయట ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం అసలు మంచిది కాదు.

అలాగే పన్నీరు కూర ఎక్కడో ఒకచోట మీరు తినే ఉంటారు. అయితే దీనిలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. అయితే దీనిని చలికాలంలో ఎక్కువగా తీసుకోవడం వలన అనారోగ్యానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజుల్లో మనం తినే జున్ను కూడా మంచిది కాదని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో అన్ని కల్తీనే దొరుకుతున్నాయి. ఎవరికి వారు కస్టమర్స్ ని ఆకట్టుకోవడానికి వివిధ రకాల పదార్థాలను వినియోగించి వాటిని అమ్ముతున్నారు. అదేవిధంగా కూరగాయలను కూడా నేరుగా ఇంట్లో వండుకునే తినడం చాలా ఉత్తమం.ఇలా చేయడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇంట్లోనే మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు.