Lemon Peels : నిమ్మ తొక్కలతో ఇన్ని ప్రయోజనాలా…అవేంటో తెలిస్తే ఇంకెప్పుడూ పడేయరు…

Lemon Peels : చాలామంది కొన్ని రకాల పండ్లు లేదా కూరగాయల తొక్కలను తీసేసి తింటూ ఉంటారు. అలాంటి వాటిలో నిమ్మకాయ కూడా ఒకటని చెప్పాలి. అయితే ఈ నిమ్మకాయ తొక్కని మనం పడేస్తుంటాం. కానీ నిజానికి ఆ నిమ్మకాయ తొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉపయోగాలు దాగి ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది నిమ్మకాయ జ్యూస్ పిండిన తర్వాత తొక్క ని పడేసుకుంటారు. కానీ ఆ తొక్కలని ఎండబెట్టి పౌడర్ […]

  • Published On:
Lemon Peels : నిమ్మ తొక్కలతో ఇన్ని ప్రయోజనాలా…అవేంటో తెలిస్తే ఇంకెప్పుడూ పడేయరు…

Lemon Peels : చాలామంది కొన్ని రకాల పండ్లు లేదా కూరగాయల తొక్కలను తీసేసి తింటూ ఉంటారు. అలాంటి వాటిలో నిమ్మకాయ కూడా ఒకటని చెప్పాలి. అయితే ఈ నిమ్మకాయ తొక్కని మనం పడేస్తుంటాం. కానీ నిజానికి ఆ నిమ్మకాయ తొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉపయోగాలు దాగి ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది నిమ్మకాయ జ్యూస్ పిండిన తర్వాత తొక్క ని పడేసుకుంటారు. కానీ ఆ తొక్కలని ఎండబెట్టి పౌడర్ లాగా చేసుకుని కూరల్లో ఉపయోగించుకోవచ్చుు. లేదా గోరువెచ్చని నీటిలో కలుపుకొని ప్రతిరోజు తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా నిమ్మకాయ తొక్కలను ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాక నిమ్మ తొక్కలో విటమిన్ సి అనేది సమృద్ధిగా ఉంటుంది.

So many benefits of lemon peels...

ఇక ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే దీనిలో ఉండే విటమిన్ సి తెల్ల రక్త కణాలు సంఖ్యను పెంచేందుకు దోహదపడుతుంది. అలాగే నిమ్మకాయలో విటమిన్ సి ,విటమిన్ ఏ మరియు కాల్షియం ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలోని కొన్ని పోషకాలు దంతాలను దృఢంగా ఉంచెందుకు చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు సహాయపడతాయి. అలాగే దీనిలో ఉండే మరికొన్ని పోషకాలు కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే నిమ్మ తొక్కలో క్యాన్సర్ ను అడ్డుకునే ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నట్లు వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

So many benefits of lemon peels...
నిమ్మ తొక్కను తీసుకోవడం వలన హైబీపీ చెడు కొలెస్ట్రాల్ మరియు ,ల అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గుతారు. అంతేకాక దీనిని తీసుకోవడం వలన కంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. శరీరానికి ఏవైనా గాయాలు అయినా వెంటనే తగ్గుతాయి. అలాగే నిమ్మ తొక్కను మొహంపై రుద్దుకోవడం వలన మచ్చలు మొటిమలు పోతాయి. ప్రస్తుత కాలంలో చాలామందికి సంకలో ఎక్కువ చెమట పట్టడం వలన దుర్వాసన వస్తుంది. అలాంటివారు నిమ్మ తొక్కను సంకలో రుద్దుకున్నట్లయితే దుర్వాసన రాదు. అలాగే నిమ్మ తొక్కను కూడా జ్యూస్ చేసుకుని తాగినట్లయితే కలరా వంటి వ్యాధులు సైతం తుడిచిపెట్టుకుపోతాయి. అలాగే నిమ్మ తొక్క జ్యూస్ ను దోమలను చంపే లార్వా లా కూడా ఉపయోగించవచ్చు.

 

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికి సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.