Health Tips : గ్యాస్ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది…డాక్టర్స్ సలహా…

Health Tips : ప్రస్తుత కాలంలో చాలామంది గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ గ్యాస్ సమస్య ఉన్నవారు నలుగురిలో చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి ఈ గ్యాస్ సమస్య నుండి బయటపడటం అంత తేలిక అయితే కాదు. అయితే గ్యాస్ సమస్య అనేది శరీరంలో వాతం పెరగడం వలన సంభవిస్తుంది. ఇక నలుగురిలో ఉన్నప్పుడు ఈ గ్యాస్ సమస్య చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. అయితే ఈ గ్యాస్ సమస్యను అధిగమించడానికి కొన్ని ముందస్తు జాగ్రత్తలు […]

  • Published On:
Health Tips :  గ్యాస్ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది…డాక్టర్స్ సలహా…

Health Tips : ప్రస్తుత కాలంలో చాలామంది గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ గ్యాస్ సమస్య ఉన్నవారు నలుగురిలో చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి ఈ గ్యాస్ సమస్య నుండి బయటపడటం అంత తేలిక అయితే కాదు. అయితే గ్యాస్ సమస్య అనేది శరీరంలో వాతం పెరగడం వలన సంభవిస్తుంది. ఇక నలుగురిలో ఉన్నప్పుడు ఈ గ్యాస్ సమస్య చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. అయితే ఈ గ్యాస్ సమస్యను అధిగమించడానికి కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….

people-with-gas-problem-must-take-these-precautions-doctors-advice

అయితే గ్యాస్ సమస్య అనేది శరీరంలో వాతం చేయడం వలన సంభవిస్తుంది కాబట్టి శరీరంలోని వాతం ను తగ్గించేందుకు వెచ్చగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే తేలికగా ,సులభంగా, జీర్ణం అయ్యే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే చల్లని పదార్థాలకు మరియు పచ్చిగా ,పొడిగా, గట్టిగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే ప్రతిరోజు భోజన సమయంలో చిటికెడు వాము పొడిని కలుపుకుని తినడం మంచిది . దీనివలన శరీరంలోని వాతం చాలా సులభంగా తగ్గుతుంది.

people-with-gas-problem-must-take-these-precautions-doctors-advice

అయితే గ్యాస్ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి రెండు రోజులపాటు భారీ ఆహారాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. బియ్యప్పిండి, బియ్యం నూక ,గోధుమ నూక వంటి తేలిక పాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం. అలాగే వంట తయారీలో ఇంగువ మరియు జీలకర్రను ఎక్కువగా ఉపయోగించాలి. అయితే గ్యాస్ సమస్య అనేది ముఖ్యంగా సమయానికి భోజనం తీసుకోకపోవడం వలన వస్తుంది. కావున ఎలాంటి పరిస్థితులో ఉన్నప్పటికీ టైం టు టైం ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో లభించే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.