Diabetes Can Eat Sweets :  డయాబెటిస్ ఉన్నవారు కూడా స్వీట్స్ తినవచ్చు….అదెలా అంటే…

Diabetes Can Eat Sweets  : డయాబెటిస్ ఉన్నవారు స్వీట్స్ అసలు తినకూడదు. ఎందుకంటే స్వీట్స్ తినడం వలన వారి రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. షుగర్ నివారించాలంటే స్వీట్లకు చాలా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తారు. కానీ కొన్ని సందర్భాలలో షుగర్ పేషెంట్ల కి కూడా స్వీట్స్ తినాలని ,వాటి తీపిని ఆస్వాదించాలనే కోరిక పుడుతుంది. అయితే ఢిల్లీకి చెందిన న్యూట్రిఫై వ్యవస్థాపకురాలు పూనమ్ దునేజా అంచనాల ప్రకారం షుగర్ ఉన్న వారు కూడా […]

  • Published On:
Diabetes Can Eat Sweets :  డయాబెటిస్ ఉన్నవారు కూడా స్వీట్స్  తినవచ్చు….అదెలా అంటే…

Diabetes Can Eat Sweets  : డయాబెటిస్ ఉన్నవారు స్వీట్స్ అసలు తినకూడదు. ఎందుకంటే స్వీట్స్ తినడం వలన వారి రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. షుగర్ నివారించాలంటే స్వీట్లకు చాలా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తారు. కానీ కొన్ని సందర్భాలలో షుగర్ పేషెంట్ల కి కూడా స్వీట్స్ తినాలని ,వాటి తీపిని ఆస్వాదించాలనే కోరిక పుడుతుంది. అయితే ఢిల్లీకి చెందిన న్యూట్రిఫై వ్యవస్థాపకురాలు పూనమ్ దునేజా అంచనాల ప్రకారం షుగర్ ఉన్న వారు కూడా కొన్నిసార్లు తక్కువ పరిమాణంలో స్వీట్లులను తినవచ్చు అని చెబుతున్నారు . అయితే ఇది కేవలం రక్తం లోని చక్కెర నియంత్రణలో ఉన్న వారు మాత్రమే చేయాలి. రక్తంలో చక్కెర నియంత్రణ లేని రోగులు మాత్రం అస్సలు వీటిని ముట్టుకోకూడదు. డయాబెటిస్ కలిగిన వారు స్వీట్స్ తినే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం..

స్వీట్స్ ఎప్పుడు తినాలి…

స్వీట్స్ తినాలనుకునేవారు ముందుగా వారి సుగర్ లెవల్స్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తినేముందు ఫైబర్ మరియు ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. తద్వారా స్వీట్లు తిన్నా కూడా బ్లడ్ షుగర్ పై మిఠాయి ప్రభావం ఎక్కువగా చూపించదు.

ఖాళీ కడుపుతో తినకూడదు….

డయాబెటిస్ కలిగిన వారు ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతో స్వీట్లు అసలు తినకూడదు. కాళీ కడుపుతో స్వీట్స్ తినడం వలన రక్తంలోని చెక్కర స్థాయి ఆకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్పాహారం లేదా భోజనం చేసిన తర్వాత మాత్రమే స్వీట్స్ తీసుకోవాలి. ఇలా తినడం వలన రక్తంలోని చక్కెర అదుపులో ఉంటుంది. ఎలాంటి సమస్యలు తలెత్తవు.

రాత్రివేళ తినకూడదు…

షుగర్ సమస్య ఉన్నవారు సాయంత్రం లేదా రాత్రి సమయంలో స్వీట్స్ తినకూడదు. షుగర్ పేషెంట్స్ రాత్రివేళ స్వీట్స్ తినడం వలన నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. అంతేకాక పదే పదే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. అంతేకాక మరుసటి రోజు వాంతులు అయ్యే అవకాశం ఉంది.

ఎలాంటి స్వీట్స్ తీసుకోవాలి…

డయాబెటిస్ కలవారు పొడి స్వీట్లను తీసుకోవడం మంచిది. అంతేకాక శీతల పానీయాలకు మరియు తీపి రసాలకు చాలా దూరంగా ఉండాలి. ద్రవ రూపంలో ఉండే స్వీట్స్ రక్తం లోని చక్కెరను వేగంగా పెంచుతాయి. కావున డయాబెటిస్ తో బాధపడేవారు పొడి స్వీట్లు తీసుకోవాలి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని , ప్రజల విశ్వాసాలు మరియు ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది.తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.