Health Tips : ఈ మూడు ఆకులతో అద్భుతమైన ప్రయోజనాలను పొందండిలా….

Health Tips : ప్రస్తుత కాలంలో చాలామంది డయాబెటిస్ మరియు ఐబీపీ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక ఈ సమస్యల నుండి బయట పడేందుకు ఎన్ని మందులు వాడినా ప్రయోజనం దక్కడం లేదు. అయితే జీవితంలో ఒక్కసారి డయాబెటిస్ హై బీపీ వచ్చాయంటే జీవితాంతం అవి మనల్ని వదలవు. ఒక్కసారి ఈ సమస్యలు వచ్చాయంటే జీవితమే తలకిందులు అవుతుంది. ఎందుకంటే ఈ సమస్యల వలన నచ్చింది తినలేము నచ్చినట్టుగా బ్రతకలేము. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే […]

  • Published On:
Health Tips : ఈ మూడు ఆకులతో అద్భుతమైన ప్రయోజనాలను పొందండిలా….

Health Tips : ప్రస్తుత కాలంలో చాలామంది డయాబెటిస్ మరియు ఐబీపీ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక ఈ సమస్యల నుండి బయట పడేందుకు ఎన్ని మందులు వాడినా ప్రయోజనం దక్కడం లేదు. అయితే జీవితంలో ఒక్కసారి డయాబెటిస్ హై బీపీ వచ్చాయంటే జీవితాంతం అవి మనల్ని వదలవు. ఒక్కసారి ఈ సమస్యలు వచ్చాయంటే జీవితమే తలకిందులు అవుతుంది. ఎందుకంటే ఈ సమస్యల వలన నచ్చింది తినలేము నచ్చినట్టుగా బ్రతకలేము. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగానే కొన్ని చిట్కాలను పాటించడం మంచిది.ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకు రసం తాగినట్లయితే షుగర్ లెవెల్స్ బిపి లెవెల్స్ అదుపులో ఉంటాయి. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఇది ఒక చక్కటి మార్గమని చెప్పాలి. అయితే ప్రధానంగా ఓ మూడు రకాల ఆకులను పరిగడుపున తినడం వలన ఎలాంటి రోగాలు దరి చేరవు. మరి ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తులసి….

get-amazing-benefits-with-these-three-leaves

తులసి మొక్కను మూలికల రాణి అని పిలుస్తుంటారు.ఇది మన శరీరాన్ని అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి రక్షిస్తుంది. కావున ఈ తులసి ఆకులను ప్రతిరోజు పరిగడుపున తీసుకోవడం వలన ఎంతో మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాక తులసి మొక్కను ఔషధాలలో ఎక్కువగా వాడుతుంటారు.

కరివేపాకు…

get-amazing-benefits-with-these-three-leaves

మా భారతీయ వంటకాలలో ప్రధానంగా ఉపయోగించే పదార్థాలలో కరివేపాకు ఒకటి. ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తుంది. కరివేపాకును తీసుకోవడం వలన జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాక కరివేపాకు లో ఉండే పోషకాలు ఇన్సూలిన్ తయారుచేసే కణాలను ఉత్తేజ పరచడంలో సహాయపడతాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

వేపాకు….

get-amazing-benefits-with-these-three-leaves

వేపాకు ఒక దివ్య మూలిక అని చెప్తుంటారు. ప్రతిరోజు పరిగడుపున ఈ వెప ఆకులను తీసుకోవడం వలన బిపి షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు వేపాకును ప్రతిరోజు తిన్నట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. ఈ మూడు ఆకులను క్రమం తప్పకుండా ప్రతిరోజు తిన్నట్లయితే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.