Health : 50 ఏళ్లు పైబడిన ప్రతి పురుషుడు కచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు…

Health  : 50 ఏళ్ల వయసు పైబడినవారు ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మరియు జీవనశైలిని మెరుగుపరచడానికి జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా పురుషులలో గత కొంతకాలంగా జీవన శైలిలోని మార్పుల వలన ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్మోకింగ్ చేయడం , ఆల్కహాల్ తీసుకోవడం, చెడు ఆహార అలవాట్లు , శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వలన క్యాన్సర్ ,డయాబెటిస్ మరియు అధిక బరువు , గుండె వంటి దీర్ఘకాలిక సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే […]

  • Published On:
Health : 50 ఏళ్లు పైబడిన ప్రతి పురుషుడు కచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు…

Health  : 50 ఏళ్ల వయసు పైబడినవారు ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మరియు జీవనశైలిని మెరుగుపరచడానికి జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా పురుషులలో గత కొంతకాలంగా జీవన శైలిలోని మార్పుల వలన ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్మోకింగ్ చేయడం , ఆల్కహాల్ తీసుకోవడం, చెడు ఆహార అలవాట్లు , శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వలన క్యాన్సర్ ,డయాబెటిస్ మరియు అధిక బరువు , గుండె వంటి దీర్ఘకాలిక సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే యవ్వనంలో ఉన్నప్పుడు వీటి ప్రభావం కనిపించదు కానీ , వయసు పెరిగే కొద్దీ వీటి ప్రభావం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన తర్వాత ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ వయసులో రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. ఇలా పరీక్షించుకోవడం వలన ఏదైనా సమస్యలు ఉంటే వాటిని మొదటి దశలోనే గుర్తించి నివారించుకోవచ్చు. అయితే 50 ఏళ్లు దాటిన తర్వాత పురుషులు చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

బ్లడ్ షుగర్…

men-should-take-these-health-tests-after-crossing-50-years

50 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేయించుకోవాలని ట్రస్ట్ ల్యాబ్ డయాగ్నొస్టిక్స్ మైక్రో బయాలజీ హెడ్ డాక్టర్ జానకి రామ్ తెలియజేస్తున్నారు. అకస్మాత్తుగా బరువు పెరగడం, గాయం త్వరగా మానకపోవడం, దాహం ఎక్కువగా వేయడం వంటి లక్షణాలు కనిపిస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ కచ్చితంగా చేయించుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు.

కొలెస్ట్రాల్ చెకప్…

men-should-take-these-health-tests-after-crossing-50-years

కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవడం వలన రక్తంలో నాలుగు రకాల లిఫీడ్లను తేలుస్తుంది. రక్తంలోని తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ LDL , అధిక సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ HDL ట్రై గ్లిజరైడ్ స్థాయిలను తెలుసుకోవడానికి ఈ పరీక్ష సహాయపడుతుంది. వీటిలో LDL కొలెస్ట్రాల్ ను చెడు కొలెస్ట్రాల్ అని అంటారు. రక్తంలో ఇది ఎక్కువగా ఉంటే గుండెపోటు ,స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. కావున 50 సంవత్సరాల దాటిన ప్రతి పురుషుడు ఏడాదికి ఒక్కసారైనా ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

రక్తపోటు….

men-should-take-these-health-tests-after-crossing-50-years

50 ఏళ్లు పైబడిన పురుషులలో హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీని కారణంగా హార్ట్ ఎటాక్, కిడ్నీ సమస్యలు, కరోనరీ ఆర్టరీ, పంటి సమస్యలు పెరుగుతాయి. దీని కోసం తరచుగా బిపిని చెక్ చేసుకోవడం మంచిది.