Monsoon Health : వర్షాకాలంలో తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు……డాక్టర్ సలహ ఏంటంటే..

Monsoon Health : ప్రస్తుతం వర్షాకాలంలో ఉన్నందున ప్రతి ఒక్కరికి విటమిన్ డి చాలా అవసరం. మనకు తెలిసిందే విటమిన్ డి సూర్య రష్మి ద్వారా లభిస్తుంది అని. అయితే ఈ వర్షం వలన సూర్య రష్మి నేరుగా బహిర్గతం కావడం చాలా కష్టం. అయినప్పటికీ ప్రతి ఒక్కరికి వారి శరీరం సక్రమంగా పనిచేయడానికి రోజు వారు విటమిన్ డి తగినంత అవసరం. అందుకే మీరు తీసుకునే ఆహారం విటమిన్ డి ని పొందడంలో సహాయపడుతుంది. విటమిన్ […]

  • Published On:
Monsoon Health : వర్షాకాలంలో తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు……డాక్టర్ సలహ ఏంటంటే..

Monsoon Health : ప్రస్తుతం వర్షాకాలంలో ఉన్నందున ప్రతి ఒక్కరికి విటమిన్ డి చాలా అవసరం. మనకు తెలిసిందే విటమిన్ డి సూర్య రష్మి ద్వారా లభిస్తుంది అని. అయితే ఈ వర్షం వలన సూర్య రష్మి నేరుగా బహిర్గతం కావడం చాలా కష్టం. అయినప్పటికీ ప్రతి ఒక్కరికి వారి శరీరం సక్రమంగా పనిచేయడానికి రోజు వారు విటమిన్ డి తగినంత అవసరం. అందుకే మీరు తీసుకునే ఆహారం విటమిన్ డి ని పొందడంలో సహాయపడుతుంది. విటమిన్ అండి శరీరానికి అందించే ముఖ్య పోషకాలలో ఒకటి. ఇది కాల్షియం శోషణలో మీకు హెల్ప్ చేస్తుంది.

precautions-to-be-taken-during-rainy-season

దీంతో పాటు కండరాల కదలికకి, మెదడు, బాడీకి సిగ్నల్స్ అందించేందుకు అవసరం. బలమైన ఇమ్యూనిటీకి కూడా విటమిన్ డి అవసరం. మన శరీరానికి విటమిన్ డి అందించే కొన్ని ఆహారాలు సహాయం చేస్తాయి. ఇందుకోసం, సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి చేపలు తీసుకోవచ్చు. గుడ్డు, పుట్టగొడుగులు, చీజ్ తీసుకోవచ్చు. పుట్టగొడుగులు తీసుకుంటే విటమిన్ డి అందుతుంది. వీటితో పాటు ఆవు పాలు, ప్లాంట్ బేస్డ్ మిల్క్, హోల్ గ్రెయిన్స్, నారింజ, పెరుగు తీసుకోవచ్చు.

precautions-to-be-taken-during-rainy-season

విటమిన్ సరిపోకపోతే డాక్టర్ని సంప్రదించి విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అయితే విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే హానికరమని గుర్తు పెట్టుకోవాలి. దీని వల్ల రక్తంలో విటిమన్ డి లెవల్స్ పెరుగుతాయి. వికారం, వాంతులు, కండరాల బలహీనత, ఇబ్బంది, నొప్పులు, ఆకలి తగ్గడం, డీహైడ్రేషన్, మూత్రవిసర్జన, దాహం, కిడ్నీల్లో రాళ్ళు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, డాక్టర్ సూచించిన మోతాదులోనే తీసుకోవాలి