Viral Video : ఈ నీటి కొలను లో ఎవరు మునిగిపోరట…..ఎందుకో తెలిసా….దీని వెనక ఇంత సైన్స్ దాగి ఉందా…?

Viral Video : ఈత బాగా వచ్చినవారు నీటిపై అనేక రకాలుగా ఈత కొడుతూ ఉంటారు. నీటిలోతు ఎంత ఉన్నా సరే పట్టించుకోకుండా నీటి ఉపరితలంపై తేలియడడం అనేది కొంతమందికి మాత్రమే సాధ్యమైన విద్య అని చెప్పవచ్చు. అయితే తాజాగా నీటిపై తేలి ఆడుతున్న ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి చేతులను కాళ్ళను ఏమాత్రం కదపకుండా నీటి ఉపరితలంపై మంచం మీద పడుకున్నట్లు చక్కగా […]

  • Published On:
Viral Video : ఈ నీటి కొలను లో ఎవరు మునిగిపోరట…..ఎందుకో తెలిసా….దీని వెనక ఇంత సైన్స్ దాగి ఉందా…?

Viral Video : ఈత బాగా వచ్చినవారు నీటిపై అనేక రకాలుగా ఈత కొడుతూ ఉంటారు. నీటిలోతు ఎంత ఉన్నా సరే పట్టించుకోకుండా నీటి ఉపరితలంపై తేలియడడం అనేది కొంతమందికి మాత్రమే సాధ్యమైన విద్య అని చెప్పవచ్చు. అయితే తాజాగా నీటిపై తేలి ఆడుతున్న ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి చేతులను కాళ్ళను ఏమాత్రం కదపకుండా నీటి ఉపరితలంపై మంచం మీద పడుకున్నట్లు చక్కగా పడుకున్నాడు. అలా అని అతను గజ ఈతగాడు అనుకుంటే పప్పులో కాలేసినట్లే . అయితే ఆ వక్తి అలా నీటి ఉపరితలంపై తేలియడడానికి వెనుక ఓ బలమైన కారణం ఉంది.

@fasc1nate అనే ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో చుట్టూ పంట భూమి ఉండగా మధ్యలో ఓ నీటికొలను ఉంది. చాలా లోతుగా ఉన్న ఆ కొలనులోని నీరు చాలా స్వచ్ఛంగా ఉండడంతో , నీటి లోపల కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఓ వ్యక్తి ఆ కొలనులోకి దిగి తన చేతులను, కాళ్ళను కదపకుండా హాయిగా పడుకున్నాడు. అంతేకాక అతను ఈత కొట్టడానికి అసలు ప్రయత్నించడం లేదు. అయినా సరే అతను మునిగిపోకుండా నీటి ఉపరితలంపై తేలి ఆడుతున్నాడు. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అతడు గజ ఈతగాడేమో అని అందరూ అభిప్రాయపడుతున్నారు.

అయితే వీడియోలో కనిపిస్తున్నది ఈజిప్ట్ లోని ,సివా ఓయాసిస్ ప్రాంతం. ఇక ఈ ప్రాంతం 95% ఉప్పు గాడత కలిగి ఉంటుంది. దీని కారణంగా ఆ ప్రాంతంలోని నీటి సాంద్రత చాలా ఎక్కువ. నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం వలన ఆ నీటిలో ఎవరు మునిగి పోరాట. ఇక ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇప్పటివరకు దాదాపుగా ఈ వీడియోను 1.7 కోట్ల మంది వీక్షించారు. వీడియో చూసిన నేటిజెనులు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఆ కోలను చాలా అందంగా ఉందంటూ కొందరు, చాలా శుభ్రంగా ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.అయితే అధిక బరువు ఉన్నవారు కూడా ఆ కోలను లో మునిగిపోకుండా తేలుతారా అని పలువురికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.