Viral Video : యువకుడుపై డిమార్ట్ కంప్లైంట్…ఇన్ స్టా రీల్స్ హనుమాన్ అరెస్టు…

Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామందికి ఓవరాక్షన్ ఎక్కువైందని చెప్పాలి. ఎప్పుడు పడితే , ఎక్కడ పడితే అక్కడ , ఏది పడితే అది రీల్స్ చేయడం ఇక దానిని తీసుకుని వచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలోనే చాలామంది సరైన నిబంధనలు తెలియకుండా ఇష్టానుసారం వ్యవహరించి అడ్డంగా కేసులలో బుక్ అవుతున్నారు. ఇలాంటి వారిలో ముందుగా నేటి తరం యువకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే […]

  • Published On:
Viral Video : యువకుడుపై డిమార్ట్ కంప్లైంట్…ఇన్ స్టా రీల్స్ హనుమాన్ అరెస్టు…

Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామందికి ఓవరాక్షన్ ఎక్కువైందని చెప్పాలి. ఎప్పుడు పడితే , ఎక్కడ పడితే అక్కడ , ఏది పడితే అది రీల్స్ చేయడం ఇక దానిని తీసుకుని వచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలోనే చాలామంది సరైన నిబంధనలు తెలియకుండా ఇష్టానుసారం వ్యవహరించి అడ్డంగా కేసులలో బుక్ అవుతున్నారు. ఇలాంటి వారిలో ముందుగా నేటి తరం యువకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. దిగ్గజ సంస్థల్లో ఒకటైన ప్రముఖ డీమార్ట్ షో రూమ్ లో తాజాగా ఓ యువకుడు దొంగతనంగా చాక్లెట్లను ఎలా తినాలి , వాటికి బిల్లు కట్టకుండా ఎలా తప్పించుకోవాలి అంటూ ఏకంగా డీ మార్ట్ షోరూమ్ లోకి వెళ్లి రీల్స్ చేసి దానిని తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి పేరు హనుమాన్ నాయక్.

అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హనుమాన్ నాయక్ వీడియో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే ఇది మొదట్లో తేలిగ్గా తీసుకున్నప్పటికీ తర్వాత దీనిని ఇలాగే వదిలేస్తే అందరూ ఇలాగే చేస్తారు అని అభిప్రాయపడిన డీమార్ట్ అధికారులు తాజాగా హనుమాన్ నాయక్ పై పోలీస్ కేసు పెట్టడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే… 22 సంవత్సరాలు గల హనుమాన్ నాయక్ తాజాగా తన స్నేహితులతో కలిసి షేక్ పేట లో ఉన్న డీమార్ట్ సూపర్ మార్కెట్లోకి వెళ్లడం జరిగింది. ఇక అక్కడ వారంతా సరదాగా తిరుగుతూ డబ్బులు చెల్లించకుండా ఎలా తినాలో వీడియో ద్వారా చూపించి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి అనుకున్నారు. ఇక అదే వారి కొంప ముంచిందని చెప్పాలి. దీనిలో భాగంగానే ముందుగా వాళ్ళు ఓ రెండు చాక్లెట్లను తీసుకొని ఆ తర్వాత ఓ షర్టు తీసుకుని ట్రయిల్ రూమ్ కి వెళ్లాడు.

అనంతరం ఆ రూమ్ లో చాక్లెట్లను తినేసి తాను తిన్న చాక్లెట్ కవర్స్ ను షర్ట్ లో పెట్టేసి తిరిగి షట్ ను ఎక్కడినుండి తీశాడో అక్కడే పెట్టేసాడు. ఇక ఈ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే వైరల్ గా మారిన వీడియోను గుర్తించిన డీమార్ట్ షేక్ పేట బ్రాంచ్ మేనేజర్ అర్జున్ సింగ్ బుధవారం రోజు ఫిలింనగర్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే చాక్లెట్లను దొంగలించి తిన్న హనుమంత్ నాయక్ తో పాటు అతని స్నేహితులపై ఐపీసీ సెక్షన్ 420 , 379 సెక్షన్లతో ఐటియాక్ట్ కింద పోలీస్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదో సరదాగా తీసుకున్న వీడియో ఏకంగా పోలీస్ కేసు వరకు వెళ్లడంతో ఇంకెప్పుడు యువత ఇలాంటివి చేయకుండా ఉండేందుకు తగిన గుణపాఠమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.