Viral Video : ఏఐ టెక్నాలజీ తో రాముని వీడియో…ఎంత ముద్దుగా ఉందో చూశారా…
Viral Video : ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి చాలామంది అందమైన అద్భుతాలను మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నారు. మరికొందరు మాత్రం దీనిని చెడు మార్గంలో వినియోగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ టెక్నాలజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇప్పటికే ఈ టెక్నాలజీతో రూపొందించిన వీడియోలను మనం సోషల్ మీడియాలో చాలానే చూసాం. అయితే మొన్నటి వరకు […]
Viral Video : ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి చాలామంది అందమైన అద్భుతాలను మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నారు. మరికొందరు మాత్రం దీనిని చెడు మార్గంలో వినియోగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ టెక్నాలజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇప్పటికే ఈ టెక్నాలజీతో రూపొందించిన వీడియోలను మనం సోషల్ మీడియాలో చాలానే చూసాం. అయితే మొన్నటి వరకు మనం చూసిన వీడియోలు అన్ని సినీ సెలబ్రిటీల మీద రాజకీయ సెలబ్రిటీలు మరియు ఇతర రంగాలలో ఉన్న సెలబ్రిటీల వీడియోలు చేస్తే ఇప్పుడు తాజాగా అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు విగ్రహానికి సంబంధించిన ఏ ఐ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. , దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అయోధ్య ఆలయంలోని బాల రాముని విగ్రహం కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తున్నట్లుగా ,తలను అటూ ఇటూ తిప్పుతూ చిరునవ్వు చిందిస్తూ కనిపించడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. @happymi ట్విటర్ ఖాతా ద్వారా ఈ వీడియో ని షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పటివరకు 17 లక్ష మంది వీక్షించగా 58 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. అంతేకాక ఈ వీడియోను చాలా మంది తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా అయోధ్య రామ మందిరంలో కొలువు దీరిన 51 అడుగుల పొడవైన బాల రాముని విగ్రహాన్ని కర్ణాటక ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజు రూపొందించారు. కమలంపై నిలబడి ఉన్న 5 ఏళ్ల రాముడు విగ్రహం ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. కాగా అయోధ్య రామ మందిరం లోని బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారంనాడు అంగరంగ వైభవంగా జరిపించారు. ఇక ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Now who did this? 🤩🙏 #Ram #RamMandir #RamMandirPranPrathistha #RamLallaVirajman #AyodhaRamMandir #Ayodha pic.twitter.com/2tOdav7GD6
— lakshmi (@happymi_) January 22, 2024