Fasting : ఉపవాసంతో వృద్ధాప్యం ఔట్…
Fasting : దైవ భక్తిలో నిమగ్నమైన వారు తరచూ ఉపవాసాలు చేస్తూనే ఉంటారు. అయితే ఎలాంటి ఉపవాసాలు చేయని వారు కూడా తప్పకుండా ఉపవాసం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఉపవాసం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి దానిలో నిజం ఎంత…?ఉపవాసానికి వృద్ధాప్యానికి సంబంధం ఏంటి..?దానివలన కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రయోజనాలు.. తరచుగా చేసే స్వల్పకాలిక ఉపవాసాలు మానవ శరీరంపై ఎంతగానో ప్రభావం […]
Fasting : దైవ భక్తిలో నిమగ్నమైన వారు తరచూ ఉపవాసాలు చేస్తూనే ఉంటారు. అయితే ఎలాంటి ఉపవాసాలు చేయని వారు కూడా తప్పకుండా ఉపవాసం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఉపవాసం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి దానిలో నిజం ఎంత…?ఉపవాసానికి వృద్ధాప్యానికి సంబంధం ఏంటి..?దానివలన కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రయోజనాలు..
తరచుగా చేసే స్వల్పకాలిక ఉపవాసాలు మానవ శరీరంపై ఎంతగానో ప్రభావం చూపుతాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఉపవాసం చేయడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి ముఖ్యంగా శరీరంలోని కణాలని రిపేర్ చేయడానికి , కంటికి మెరుగైన నిద్రను అందించడానికి , మరీ ముఖ్యంగా ఊబకాయం బారిన పడకుండా స్థిరమైన బరువును మెయింటైన్ చేయడానికి ఉపవాసం ఎంతగానో పనిచేస్తుందట.
అయితే 2023లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం..వారానికి మూడు లేదా నాలుగు రోజులు అడపాదడప ఉపవాసం చేసే వారి ఆరోగ్యం చాలా బాగుందట. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సైతం మెరుగుపడుతుందని వైద్యులు నిర్ధారించారు. తద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఉపవాసం చాలా ముఖ్యమైన అంశం అని వైద్యులు చెబుతున్నారు.
అదేవిధంగా గుండె ఆరోగ్యం కూడా ఉపవాసంతో ముడిపడి ఉంటుంది. ఇది రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుందని ఓ అధ్యయనంలో తేలిందట. ఊబకాయంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా చాలా వరకు తగ్గించడానికి ఉపవాసం సహకరిస్తుందని వైద్యులు అంటున్నారు.
ఈ ప్రయోజనాలతో పాటు ఉపవాసం చేయడం వలన వృద్ధాప్య చాయలను కూడా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాలనికి ఉపవాసం చేయడం వలన ఎముక మాజ్జ ,పరిధియ ప్రసరణ మధ్య ఇమ్యూని సేల్స్ లేదా న్యూకో సైట్లను రీ డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా శరీరంలోని రోగ నివేదన శక్తి పని తీరు ప్రభావితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా వయసు మీద పడే ప్రక్రియ ఆలస్యం అవుతుందని వారు తెలియజేశారు.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.